చెన్నై.. పోలీసు కస్టడీలో తండ్రీ కొడుకుల మృతి..తమిళనాడులో రేపు బంద్

చెన్నై లో ఓ మొబైల్ షాపు యజమాని జయరాజ్, అతని కొడుకు పెన్నిస్ పోలీసు కస్టడీలో మరణించడం రాష్ట్ర వ్యాప్త సంచలనమైంది. వారి మృత దేహాలను తీసుకునేందుకు వారి కుటుంబం నిరాకరించింది. మరణాలకు వారి మరణాలకు కారకులైన పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ ఖాకీలపై హత్యాభియోగాలు  మోపాలని ఆ కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఇది ట్విన్ మర్డర్.. తన తండ్రి, సోదరుని మృతదేహాలపై అనేక గాయాలున్నాయి. పోలీసు స్టేషన్ లో రాత్రంతా నిర్బంధించి వారిని […]

చెన్నై.. పోలీసు కస్టడీలో తండ్రీ కొడుకుల మృతి..తమిళనాడులో రేపు బంద్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 25, 2020 | 4:14 PM

చెన్నై లో ఓ మొబైల్ షాపు యజమాని జయరాజ్, అతని కొడుకు పెన్నిస్ పోలీసు కస్టడీలో మరణించడం రాష్ట్ర వ్యాప్త సంచలనమైంది. వారి మృత దేహాలను తీసుకునేందుకు వారి కుటుంబం నిరాకరించింది. మరణాలకు వారి మరణాలకు కారకులైన పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ ఖాకీలపై హత్యాభియోగాలు  మోపాలని ఆ కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఇది ట్విన్ మర్డర్.. తన తండ్రి, సోదరుని మృతదేహాలపై అనేక గాయాలున్నాయి. పోలీసు స్టేషన్ లో రాత్రంతా నిర్బంధించి వారిని టార్చర్ పెట్టారు అని జయరాజ్ కుమార్తె ఆరోపించింది. ఇందుకు కారకులైన పోలీసులను వెంటనే అరెస్టు చేసేంతవరకు తాము ఈ మృత దేహాలను తీసుకునే ప్రసక్తి లేదని ఆమె పేర్కొంది. ఓ మొబైల్ స్టోర్ నడుపుకునే జయరాజ్, పెన్నిస్ లను పోలీసులు గత శుక్రవారం అరెస్టు చేశారు. అనుమతించిన వేళల కన్నా ఎక్కువ అసమయం ఈ షాపును తెరిచి ఉంచారన్న ఆరోపణపై వారిని నిర్బంధంలోకి తీసుకున్నారు. అయితే ఈ తండ్రీ కొడుకులు తమను దుర్భాషలాడారని, తమపై దౌర్జన్యానికి యత్నించారని పోలీసులు ఆరోపించారు. వారి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చివరికి ఈ ఘటన కోర్టు వరకు వెళ్ళింది. కాగా.. జయరాజ్ పెన్నిస్ మృతికి సంతాపం ప్రకటిస్తూ  శుక్రవారం తమిళనాడులో బంద్ పాటించాలని వ్యాపారులు పిలుపునిచ్చారు.