కవలల్ని పెళ్లాడిన కవలలు : మరో విచిత్రం కూడా !
అమెరికాలో... ఇద్దరు అందమైన కవల సోదరీమణులు..ఇద్దరు కవలల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. ఆ కోరిక నెరవేరింది. తాజాగా ఇప్పడు ఇద్దరు కవల సోదరీమణులు తాము ఒకేసారి ప్రెగ్నెంట్స్ అని అనౌన్స్ చేశారు.
అమెరికాలో… ఇద్దరు అందమైన కవల సోదరీమణులు..ఇద్దరు కవలల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. ఆ కోరిక నెరవేరింది. తాజాగా ఇప్పడు ఇద్దరు కవల సోదరీమణులు తాము ఒకేసారి ప్రెగ్నెంట్స్ అని అనౌన్స్ చేశారు. బ్రిట్టనీ, బ్రియానా డీన్…కవలలైన జోష్, జెరెమీ సాల్యర్స్లను వివాహం చేసుకున్నారు. ఇప్పుడీ కపుల్స్… తన కుటుంబాల్లోకి రాబోతున్న పిల్లల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. 2018 ఆగస్టులో ఈ రెండు పెళ్లిళ్లూ ఘనంగా జరిగాయి. అంతే అప్పటి నుంచీ ఈ పెయిర్స్ సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు అయిపోయారు. వారు ఏ పోస్ట్ పెట్టినా భారీగా లైక్స్, షేర్స్ వచ్చేవి. ఈ జంటలు..ఎక్కడికి వెళ్లినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండేవారు. వీళ్లకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 47 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు తాజాగా తాము గర్భవతులం అని ఆ కవల సోదరీమణులు శుభవార్త చెప్పారు. దీంతో నెటిజన్లు తెగ శుభాకాంక్షలు చెబుతున్నారు. వారి పిల్లలు ఎలా ఉంటారో అన్న ఇంట్రస్ట్ అందరిలోనూ నెలకుంది. ఇద్దరికి పిల్లలు కూడా ఒకే రోజు పుట్టాలన్నది వీళ్లు ప్లాన్ చేసుకున్నారట. ఆ కోరిక నెరవేరుతుందో, లేదో చూడాలి.
Also Read :
పబ్జీ ఆడేందుకు ఫోన్ ఇవ్వలేదని బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు
కరోనా కొత్త జన్యువు గుర్తించిన మలేసియా : పది రేట్లు వేగంగా వైరస్ వ్యాప్తి