Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

దారుణం..20 కోతుల్ని చంపేశారు !

Twenty Monkeys Killed In Siddipet, దారుణం..20 కోతుల్ని చంపేశారు !

సిద్దిపేట జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దాదాపు 20 కోతుల్ని చంపేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఒకేచోట కుప్పగా పడివున్న కోతుల కళేబారాలను చూసిన స్థానికులు నివ్వేర పోయారు. ఈ ఘటన గజ్వేల్‌ మండలం రిమ్మన గూడలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా రాజీవ్‌ రహదారి పక్కన రిమ్మాన గూడ సమీపంలో 20 వానరాలు మృతి చెంది కనిపించాయి. తెల్లవారు జామున అటుగా వెళ్తున్న రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కోతులకు తినే తిండిలో మత్తు పదార్థాలు కలిపి చంపి ఉంటారని, ఆ తర్వాత తమ గ్రామ సమీపంలో పడేసి వెళ్లినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కోతుల మరణంపై పూర్తి నివేదిక కోసం ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందజేశారు. ఇదిలా ఉంటే, కోతులను చంపటంపై జంతుప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల్ని చంపటం మంచిది కాదని, అది అంజన్నకు ఆగ్రహం తెప్పించే విషయంగా పరిగణిస్తున్నారు.