పిడుగుపాటుకు 12 మంది మృతి, 8 మందికి గాయాలు

బిహార్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ మృతులంతా బీహార్‌లోని సరన్, జాముయ్, భోజ్‌పుర్ జిల్లాలకు..

పిడుగుపాటుకు 12 మంది మృతి, 8 మందికి గాయాలు
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 7:52 PM

బిహార్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ మృతులంతా బీహార్‌లోని సరన్, జాముయ్, భోజ్‌పుర్ జిల్లాలకు చెందినవారు. మృతుల్లో సరన్ జిల్లాకు చెందినవారే ఏకంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా, జాముయ్‌లో ఇద్దరు, భోజ్‌పుర్‌లో ఒకరు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణాధికారులు తెలిపారు.

కాగా ఈ విషాద ఘటనపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉన్నందున మృతుల సంఖ్య తక్కువగానే ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు చేసినప్పుడు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సీఎం కోరారు.

Read More: 

తెలంగాణలో ఇకపై ఆ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు

లాక్‌డౌన్ ఇప్పుడే కాదు.. నిజాం కాలంలోనూ ఉంది! అప్పుడేం చేసేవారంటే?