Breaking News
  • ఏపీ అసెంబ్లీలో మహిళల భద్రతపై స్వల్పకాలిక చర్చ. మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు-హోంమంత్రి సుచరిత. మహిళల రక్షణ, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. మహిళామిత్ర విభాగం ఏర్పాటు చేశాం. మహిళా కానిస్టుబుళ్లను నియమించాం. ఆత్మహత్యలు, ఒత్తిడి నిర్వహణ అంశాలపై కౌన్సెలింగ్‌. బాల్య వివాహాల నియంత్రణకు అవగాహన కల్పిస్తున్నాం-సుచరిత.
  • ప్రతి రైతుబజార్‌లో ఉల్లిని ప్రభుత్వం విక్రయిస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాం. 36,536 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నాం. మేం రూ.25కే కిలో ఉల్లి ఇస్తే హెరిటేజ్‌లో రూ.200కు అమ్ముతున్నారు.
  • మహిళల భద్రతపై చర్చిస్తుంటే టీడీపీ అడ్డుకుంటోంది. ఉల్లిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది-మంత్రి బుగ్గన. మహిళల పట్ల ప్రతిపక్షానికి బాధ్యతలేదు-మంత్రి బుగ్గన.
  • టీడీపీ ఎమ్మెల్యేలకు మహిళల భద్రత అవసరం లేదా-ఎమ్మెల్యే రజని. మహిళలు అభద్రతాభావంతో ఉన్నారు. మహిళల భద్రతపై మాట్లాడుతుంటే అడ్డుకుంటారా. మహిళల రక్షణపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు-ఎమ్మెల్యే రజని. మహిళలపై టీడీపీ నేతల నేరాలు బయటపడతాయనే చర్చను అడ్డుకుంటున్నారు. కాల్‌మనీ వ్యవహారంలో టీడీపీ నేతలకు సంబంధాలున్నాయి-ఎమ్మెల్యే రజని.
  • టీడీపీ సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని ఆగ్రహం. ఉల్లి ధరలపై సీఎం చర్చిస్తామన్నారు. మహిళల భద్రతపై చర్చను అడ్డుకోవడం తగదు. చర్చకు సహకరించాలని కోరిన స్పీకర్‌ తమ్మినేని.
  • దిశ ఘటనతో మహిళలందరూ తల్లడిల్లిపోయారు-రోజా. సీఎం జగన్‌పై మహిళలందరికీ నమ్మకం ఉంది. మహిళలందరూ తమ గోడును జగన్‌కు చెప్పాలనుకుంటున్నారు. ఒక మహిళను హోంమంత్రి చేసిన ఘనత జగన్‌ది. హోంమంత్రి మాట్లాడుతుంటే టీడీపీ అడ్డుకుంటోంది. కాల్‌మనీ, లోకేష్‌ ఫొటోలు, బాలకృష్ణ వ్యాఖ్యలపై.. చర్చ జరుగుతుందేమోనని టీడీపీ అడ్డుకుంటోంది. మహిళలంటేనే టీడీపీ నేతలకు చులకన భావం. మహిళల భద్రతపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు-రోజా. దిశ ఘటన తర్వాత మహిళలు భయపడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయి-రోజా. ఆంధ్రప్రదేశ్‌ అంటే ఆడవాళ్లప్రదేశ్‌గా మారాలి-రోజా. రేప్‌ చేసి చంపినప్పుడు గుర్తురాని మానవ హక్కులు.. ఎన్‌కౌంటర్‌ చేస్తే ఎందుకు గుర్తుకువస్తున్నాయి. దిశ కుటుంబసభ్యులను హెచ్‌ఆర్సీ ఎందుకు పరామర్శించలేదు-రోజా.
  • ఏపీ శాసనమండలిలో ఉల్లి ధరపై టీడీపీ వాయిదా తీర్మానం. మాతృభాషపై బీజేపీ వాయిదా తీర్మానం. వాయిదా తీర్మానాలను తిరస్కరించిన చైర్మన్‌. మండలిలో టీడీపీ సభ్యుల నిరసన.

పొలంలో 12 అడుగుల భారీ మొసలి..తర్వాత ఏం జరిగిందంటే..

twelve Foot Crocodile Rescued In Vadodara. Watch Terrifying Video, పొలంలో 12 అడుగుల భారీ మొసలి..తర్వాత ఏం జరిగిందంటే..

సాధారణంగా మొసలి అనగానే భయమేస్తుంది. దాని రూపాన్ని చూడగానే ఒళ్లు గగుర్పొడుస్తుంది. భయంతో పరుగులు పెడతాం. ఐతే గుజరాత్‌ వడోదరాలోని రావల్‌ వాసులు కూడా తమ పంటపొలాల్లోకొచ్చిన 12 అడుగుల భారీ మొసలిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారమందించారు. దీంతో అక్కడికి చేరుకున్న వైల్డ్‌ లైఫ్‌రెస్క్యూ టీమ్‌..స్థానిక యువకులతో కలిసి ఐదారు గంటల పాటు తీవ్రంగా శ్రమించారు. చివరకు ఎలాగోలా ఆ మొసలిని పట్టుకొని వాఘోడియా అటవీ అధికారులకు అప్పగించారు.

రావల్‌ పంటపొలాల్లో భారీ మొసలి ఉన్నట్లు స్థానిక నర్మదా కాలువ ఇంజనీర్ల నుంచి తమకు కాల్‌ వచ్చిందని..అక్కడికి వెళ్లి ఆ మొసలిని పట్టుకోవడానికి ఐదారు గంటలపాటు శ్రమించాల్సివచ్చిందన్నారు హేమంత్‌ వాధ్వానా అనే వైల్డ్‌లైఫ్‌ యాక్టివిస్ట్‌.  దగ్గరలోని అజ్వా అనే రిజర్వాయర్‌ నుంచి కాలువల ద్వారా పొలంలోకి ప్రవేశించి ఉండొచ్చని తెలిపారు. ఇక ఆ క్రొకొడైల్‌ను మొసళ్లకు నివాసంగా ఉన్న సమీపంలోని సరస్సులో వదిలిపెట్టినట్టినట్లు తెలిపారు అటవీ అధికారులు. గతేడాది కాలంలో ఇదే ప్రాంతంలో ఇది మూడవ ఘటన అని వెల్లడించారు