Breaking News
  • కరోనా బాధితుడు డిశ్చార్జ్ పూర్తిగా కోలుకున్న 65 ఏళ్ళ వృధ్ధుడు మక్కాకు వెళ్ళొచ్చి కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన బాధితుడు విశాఖలో తొలిపాజిటివ్ కేసుగా 65 ఏళ్ళ వృధ్ధుడు 3 రోజులపాటు ఆసుపత్రిలోనే చికిత్స.. విశాఖలో తొలి సక్సెస్ తో ఊపిరిపీల్చుకున్న వైద్యాధికారులు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న మరో అయిదుగురు కరోనా బాధితులు
  • మద్యం పిచ్చి కుదిరేనా: డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌తో వచ్చే వారికి మద్యం సరఫరాకు కేరళ సర్కార్‌ నిర్ణయం, తప్పుపట్టిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, ఎర్రగడ్డ ఆస్పత్రికి క్యూకట్టిన బాధితులు, వందల సంఖ్యలో ఓపీ కేసులు.
  • కరోనాకు 50 మంది డాక్టర్లు బలి: ఒక్క ఇటలీలోనే కరోనాకు 50 మంది డాక్టర్లు చనిపోయినట్టు డాక్టర్ల సంఘం ప్రకటన.
  • అమెరికా కంటే భారత్‌లోనే కరోనా మరణాల రేటు అధికం, అమెరికాలో 1 పాయింట్‌ 74 శాతం ఉంటే ఇండియాలో 2 పాయింట్‌ 70 శాతం ప్రపంచ సగటు 4 పాయింట్‌ 69 శాతం.
  • ఢిల్లీ లోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మతపరమైన ప్రార్దన కు వెళ్లి వచ్చిన వారిలో... 15 మందిని గుర్తించిన మియాపూర్ పోలీసులు. 10 మందిని టెస్టుల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలింపు. ఈ నెల 13 న ఢిల్లీ వెళ్లి 15 వ తేదీన తిరిగి వచ్చిన మియాపూర్ హఫీజ్ పేట్ కు చెందిన వాసులు..

ట్వీట్లతోనే పొలిటికల్ హీట్: ఏపీ రాజకీయాలు ఎటువైపు..?

Tweets create political heat in AP, ట్వీట్లతోనే పొలిటికల్ హీట్: ఏపీ రాజకీయాలు ఎటువైపు..?

ట్వీట్స్.. ఇప్పుడు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. దేశంలో.. రాష్ట్రంలో.. ఏం జరిగినా.. వెంటనే అందరూ.. ట్వీట్స్ ద్వారా తమ మనోభావాలను తెలుపుతూంటారు. ఈ విషయంలో.. పొలిటికల్ లీడర్స్ ముందుంటారనే చెప్పాలి. ఒకప్పుడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. అన్యాయాలు.. అక్రమాలపై ప్రశ్నించేవారు. ఇప్పుడు ట్విట్టర్ పిట్ట వచ్చినకాన్నుంచీ.. క్షణాల్లో.. స్పందిస్తున్నారు. ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ లేని రాజకీయ నాయకుడే లేదు. దీంతో.. అటు ఫాలోయింగ్.. ఇమేజ్ కూడా వస్తుంది కదా. ఒకప్పుడు ఫేస్‌బుక్‌ ఎంత సక్సెస్‌.. అయ్యిందో.. ఇప్పుడు.. ట్విట్టర్ అంతకంటే.. ఎక్కవనే అని చెప్పవచ్చు. సాడ్ న్యూస్ అయినా.. గుడ్ న్యూస్‌ అయినా.. ట్విట్టర్‌ ద్వారా ఓ ట్వీట్ పడేస్తే చాలు. వీళ్లు కూడా స్పందించారని.. ప్రజలు భావిస్తారనుకుంటున్నారు.

కాగా.. ఇప్పుడు ఈ ట్వీట్లతోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.. మరింత హీట్‌గా మారాయి. ఒక మాట అనడానికి.. పదిసార్లు ఆలోచించే.. నేతలు.. ఇప్పుడు మరింత దిగజారే పదజాలంతో.. దూషించుకుంటున్నారు. ఒకరిపై మరొకరు.. అసభ్యకర పదజాలంతో ట్వీట్లు కురిపిస్తున్నారు. మీడియా ముందు.. తిట్ల దండకం అందుకునే నేతలు, ఇప్పుడు ట్వీట్ల దండకాన్ని అందుకుంటున్నారు. ఒక్క ట్వీట్‌తో రాజకీయాల్నిషేక్ చేస్తున్నారు. ముఖ్యంగా మరికొందరు నేతలు.. ఎప్పుడూ సోషల్ మీడియాతోనే కాలక్షేపం చేస్తున్నారు.

అప్పట్లో.. పవన్ కళ్యాణ్.. తరువాత ఏపీ సీఎం జగన్, చంద్రబాబు, ఇప్పుడు విజయసాయి రెడ్డి, లోకేష్, కేశినేని నాని, బుద్ధావెంకన్నలు సరిలేరు మాకెవ్వరూ అంటూ.. ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తూనే ఉంటారు. రోజూ.. టిఫిన్‌ చేయకుండా ఉంటారేమో కానీ.. ట్విట్టర్‌ ట్వీట్ పెట్టకుండా ఉండరేమో.. అన్నవిధంగా వారు తయారయ్యారు. ఇక ప్రజలు, మీడియా కూడా.. ఈరోజు వారు ట్వీట్ చేయలేదా..! అంటూ.. గుర్తించుకునే స్థాయికి వెళ్లింది మన ట్విట్టర్ పిట్ట.

రాజకీయాల్లోకి రాక ముందు కానీ.. వచ్చిన తరువాత కానీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సమస్యలపై, అక్రమాలపై స్పందిస్తూనే ఉంటారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. తన నిర్ణయాన్ని చెప్పేవారు. ఈ మధ్య ఈయన డైరెక్ట్‌గానే పలు జిల్లాల్లో పర్యటిస్తూ.. ట్విట్టర్‌పై ధ్యాస తగ్గించారు.

ఇక.. ఏపీ సీఎం జగన్.. 2019 ఎలక్షన్స్ ముందు వరకూ.. ట్విట్టర్‌లో.. టీడీపీపై ప్రభుత్వాన్ని ఎండగుడుతూ.. ట్వీట్స్ పెడుతూండేవారు. జగన్ సీఎం అయిన తరువాత.. కేవలం కొన్నివాటికి మాత్రమే ట్విట్టర్‌లో స్పందిస్తూన్నారు.

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు.. ఏ లేటెస్ట్ టెక్నాలజీనైనా వినియోగించుకోవడంలో దిట్ట. మరి ట్విట్టర్ పిట్టని వదిలేస్తారా ఏంటి..! ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచీ ట్విట్టర్ ఖాతాను వినియోగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకపడుతూ.. ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు.

కొన్ని నెలలకు ముందు.. టీడీపీ ఎంపీ కేశినేని నాని, టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన ట్వీట్లకు.. తెలుగుదేశం నాయకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నువ్వెంతంటే.. నువ్వెంతని.. ట్వీట్స్ చేసుకున్నారు. తాజాగా.. నాని వైసీపీ ప్రభుత్వం.. స్శశాన వాటికను కూడా వదిలిపెట్టదంటూ.. ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

ఇక.. ట్విట్టర్‌ గురువుగా విజయసాయి రెడ్డి నిలుస్తారనే చెప్పాలి. నిత్యం ఏదోఒక వివాదానికి తెరలేపుతూ.. ఉంటారు. ముఖ్యంగా.. టీడీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో విరుచుకు పడుతూంటారు. తాజాగా.. విజయసాయి.. చంద్రబాబు సినిమా అట్టర్‌ ఫ్లాప్ అంటూ.. ట్వీట్ చేశారు. దీనికి క్షణాల్లోనే.. లక్షల వ్యూస్ వచ్చాయి. అలాగే.. ఆయన ఈ రోజు కూడా.. ఉమపై విరుచుకపడ్డారు.

ఇప్పుడు తాజాగా.. మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు నారా లోకేష్.. ఊహించని విధంగా.. ట్వీట్లు చేస్తూ.. ప్రస్తుత రాజకీయాల్నిషేక్ చేస్తున్నారు. వినూత్న రీతిలో.. ఆయన ఒక్కో ట్వీట్ చేస్తూ.. వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు.

Related Tags