సజ్జన్నార్‌‌పై ఓవైసీ సెటైర్.. ఇరాన్‌కు సైబరాబాద్‌కు లింక్ ఇదే

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత తెలంగాణ పోలీసులకు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి మధ్య ట్వీట్ వార్‌గా మారింది. హైదరాబాద్ సిటీలోని ఐటీ కంపెనీలలో పలువురు జిహాదీలు పని చేస్తున్నారంటూ కొందరు ట్వీట్ చేస్తున్న అంశాన్ని ఎంపీ ఓవైసీ.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌తో పాటు రాష్ట్ర డీజీపి, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లనుద్దేశించి ట్వీట్ చేశారు. హైదరాబాద్ ఐటీ కంపెనీలలో జిహాదీలున్నారంటూ ట్విట్టర్ వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. అసదుద్దీన్ తన […]

సజ్జన్నార్‌‌పై ఓవైసీ సెటైర్.. ఇరాన్‌కు సైబరాబాద్‌కు లింక్ ఇదే
Follow us

|

Updated on: Jan 08, 2020 | 1:39 PM

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత తెలంగాణ పోలీసులకు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి మధ్య ట్వీట్ వార్‌గా మారింది. హైదరాబాద్ సిటీలోని ఐటీ కంపెనీలలో పలువురు జిహాదీలు పని చేస్తున్నారంటూ కొందరు ట్వీట్ చేస్తున్న అంశాన్ని ఎంపీ ఓవైసీ.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌తో పాటు రాష్ట్ర డీజీపి, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లనుద్దేశించి ట్వీట్ చేశారు. హైదరాబాద్ ఐటీ కంపెనీలలో జిహాదీలున్నారంటూ ట్విట్టర్ వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. అసదుద్దీన్ తన ట్వీట్‌లో సురేశ్ కొచ్చతిల్ అనే వ్యక్తి చేసిన మరో ట్వీట్‌ను రెఫరెన్స్‌గా పోలీసుల ముందు పెట్టారు.

ఎంపీ ఓవైసీ ట్వీట్‌పై సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్ రెస్పాండయ్యారు. ఐటీ కంపెనీలలో జిహాదీలున్నట్లు తమకు సమాచారం వుందని, వారిని గుర్తించే నైపుణ్యం కూడా తమకు వుందని ట్వీట్ ద్వారా సమాధానమిచ్చారు సజ్జన్నార్. దీనికి ఓవైసీ మరోసారి స్పందిస్తూ… ఒక ఎంపీకి సమాధానమిస్తున్నట్లుగా లేదన్న అర్థం వచ్చేలా ట్వీట్ చేస్తూ సజ్జన్నార్‌కు మరో చురకంటించారు. ఒకవేళ జిహాదీలున్నారన్నది నిజమే అయితే వారిని ‘ఎన్‌కౌంటర్’ చేయవద్దని ఓవైసీ సజ్జన్నార్‌ను కోరారు. అరెస్టు చేయమని, థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించవచ్చని, కానీ దిశ కేసు మాదిరిగా ఎన్ కౌంటర్ మాత్రం చేయద్దని ఓవైసీ సజ్జన్నార్‌కు సెటైరిక్‌గా ట్వీట్ చేశారు ఓవైసీ. ఉగ్రవాదులకు మతంతో సంబంధం లేదంటూ నాథూరాం గాడ్సే కేసును ఉదహరించారు సీనియర్ ఓవైసీ.

కాగా ఓవైసీ, పోలీసుల ట్వీట్ సంవాదంపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. ఓవైసీ ట్వీట్లు ఉగ్రవాదులను, జిహాదీలను సమర్థించేవిగా వున్నాయంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. నిజంగానే ఉగ్రవాదానికి మతం లేదని, కొందరి వల్ల మొత్తం మతానికి ఉగ్రవాదాన్ని ఆపాదించవద్దని మరికొందరు స్పందిస్తున్నారు.

మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్దమేఘాలు హైదరాబాద్‌పై ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ దగ్గర సిటీ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరాన్, అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ కార్యాలయం దగ్గర భద్రత పెంచాల్సిందిగా కేసీఆర్ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. దాంతో బేగంపేటలో వున్న యూఎస్ కాన్సులేట్ కార్యాలయం దగ్గర భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రతీ ఒక్కరిని చెక్ చేసి గానీ కార్యాలయంలోకి పంపడం లేదు. దీంతో బేగంపేటలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ముందస్తుగా బాంబు స్క్వాడ్‌ని రప్పించారు. సమీప ప్రాంతాలలో తనిఖీలతో జల్లెడ పడుతున్నారు పోలీసులు.