Breaking News
  • ఢిల్లీ: తెలంగాణలోని కల్వకుర్తి నుండి ఏపీ లోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి . నూతన జాతీయ రహదారి తో హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య తగ్గనున్న 80 కిలోమీటర్ల దూరం . కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం . ప్రాజెక్టులో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం. భారతమాల పథకం కింద జాతీయ రహదారికి అనుమతి ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ . 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న కేంద్ర ప్రభుత్వం . 86 కిలోమీటర్లు తెలంగాణలోనూ, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు , నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జి నెడునూరి దిలీపాచారి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన గడ్కరీ.
  • మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రేపై నటి కంగనా విమర్శలు. నేను మీలా తండ్రి సంపాదించిన ఆస్తిని తీసుకోను. అలా తీసుకోగలిగితే హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఉండేదాన్ని. తండ్రి సంపాదనపై బతకడం నాకు ఇష్టం లేదు. నేను ఆత్మగౌరవంతో బతుకుతా-ట్విట్టర్‌లో కంగనా రనౌత్‌.
  • గీతం భూముల విషయంలో కోర్టు ఆర్డర్‌ను టీడీపీ వక్రీకరిస్తోంది. గీతం వర్సిటీ ఆధీనంలోని శాశ్వత నిర్మాణాలు మాత్రమే.. తొలగించొద్దని కోర్టు సూచించింది-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌. గీతం వర్సిటీ ప్రాంగణంలో ఆక్రమిత భూమిని.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. గీతం నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన భూములను.. ప్రజా అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములున్నాయంటూ.. విమర్శలు చేసే టీడీపీ నేతలు రుజువు చేయాలి-అమర్‌నాథ్‌.
  • ఖుష్బూ ట్వీట్‌ : మహిళల ఆత్మగౌరవం కోసం నా చివరి శ్వాస ఉన్నంత వరకు పోరాడుతాను .మోదీ ఎప్పుడూ మహిళల రక్షణ గురించి ఆలోచిస్తుంటారు .మేం ఆయన బాటలో నడుస్తాం .మహిళల మీద జరిగే దాడులను ఎప్పటికీ సహించం .శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే ఎందుకు అంగీకరించరు? .మిగిలిన పార్టీలకు ఇచ్చే పర్మిషన్లు మాకెందుకు ఇవ్వరు? .మన ప్రయాణాన్ని మధ్యలో బలవంతంగా ఎవరో ఆపుతున్నారంటే... మనం సరైన బాటలో ఉన్నట్టే.
  • చెన్నై : సినీ నటి బిజెపి నేత కుష్బూ అరెస్ట్ . వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ కి వ్యతిరేఖం గా ఆందోళనలకు పిలుపునిచ్చిన బిజెపి. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన తిరుమావళవన్ ని అరెస్ట్ చేయాలనీ చిదంబరం లో బిజెపి ఆందోళనలు . ఆందోళనలకు వెళ్తున్న బిజెపి నేత కుష్బూ ని ఈసీఆర్ రోడ్డు లో అరెస్ట్ చేసిన పోలీసులు.
  • విజయనగరం : నేడే ఉత్తరాంధ్ర కొంగుబంగారం పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం. కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి నిరాకరణ. సాయంత్రం నాలుగు గంటలకు భక్తులకు దర్శనమివ్వనున్న సిరిమాను. ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. సిరిమాను ఉత్సవం కు సర్వం సిద్ధం.

ఈఎన్‌బిఏ అవార్డుల్లో సత్తా చాటిన టీవీ9 తెలుగు

, ఈఎన్‌బిఏ అవార్డుల్లో సత్తా చాటిన టీవీ9 తెలుగు

హైదరాబాద్: టీవీ9.. భారత్‌లో నెంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్. ప్రజలకు ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ దూసుకెళుతున్న టీవీ9 తెలుగుకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. వార్త కవరేజ్‌లో జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు దక్కింది.

ఎక్స్‌ఛేంజ్ ఫర్ మీడియా న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ అవార్డ్స్(ఈఎన్‌బిఏ)లో టీవీ9 తెలుగు ఛానల్ సత్తా చాటింది. జాతీయ స్థాయిలో బెస్ట్ న్యూస్ కవరేజ్ విభాగంలో అవార్డు దక్కించుకుంది. ప్రతిష్టాత్మకమైన అమరనాథ్ యాత్రను కవర్ చేసినందుకు గానూ టీవీ9 తెలుగుకి ఈ అవార్డు దక్కింది. నోయిడాలో జరిగిన ఈ కార్యక్రమంలో టీవీ9 ప్రతినిధులు అవార్డును స్వీకరించారు.

ఇది ఈఎన్‌బిఏ అవార్డుల 11వ ఎడిషన్. నోయిడాలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. దక్షిణ భారత దేశంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఉన్న మీడియా సంస్థలను పరిగణనలోకి తీసుకున్నారు. భారత్‌లో టీవీ మీడియా భవిష్యత్తును నిర్ణయించే విధంగా అడుగులు వేస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించే మీడియా సంస్థలకు ఈఎన్‌బిఏ అవార్డులు దక్కుతాయి.

ఏబీపీ న్యూస్, ఆజ్ తక్, ఎన్డిటీవీ, న్యూస్ 9, ఇండియా టుడే టీవీ, జీ న్యూస్, పిటిసి న్యూస్, టీవీ9 మరాఠి, టీవీ9 కన్నడ, టీవీ9 తెలుగు, సీఎన్ఎన్ న్యూస్ 18, మిర్రర్ నౌ, బిబిసి న్యూస్ హింది తదితర మీడియా సంస్థలకు అవార్డులు దక్కాయి.

జర్నలిజంలో టీవీ9 ఉత్తమ విలువలు పాటిస్తుందనడానికి ఈ అవార్డులే నిదర్శనం. తెలుగు ప్రజలకు టీవీ9 తెలుగుపై ఉన్న నమ్మకాన్ని నిలబెడుతూ మరింత ఉత్తమంగా పని చేసే దిశగా టీవీ9 తెలుగు దూసుకెళుతోంది.

Related Tags