Breaking News
  • కేంద్ర హోంశాఖ జారీ చేసిన సరికొత్త మార్గదర్శకాలు. కోవిడ్ ఆంక్షలు సడలిస్తూ కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు. పాఠశాలలు తెరిచే విషయంలో రాష్ట్రాలకే స్వేచ్ఛ. కంటైన్మెంట్ జోన్లలో మరింత కఠినంగా ఆంక్షలు. కంటైన్మెంట్ జోన్ల వెలుపల మరిన్ని సడలింపులు.
  • అక్టోబర్ 15 తర్వాత నుంచి ఆంక్షల సడలింపులు: 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరిచేందుకు అనుమతి. క్రీడాకారులు ఉపయోగించే స్విమ్మింగ్ పూల్స్ తెరిచేందుకు అనుమతి. ఎంటర్‌టైన్మెంట్ పార్కులు, ఆ తరహా ప్రదేశాలు తెరిచేందుకు సైతం అనుమతి. తెరుచుకోనున్న అన్ని చోట్లా కఠినంగా కోవిడ్ జాగ్రత్తల అమలు. అక్టోబర్ 15 తర్వాత దశలవారిగా విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు. పాఠశాలల్లో కఠినంగా కోవిడ్ జాగ్రత్తల అమలు. ఆన్‌లైన్ - దూరవిద్య విధానాల కొనసాగింపు. ఆన్‌లైన్ తరగతులు కోరుకున్న విద్యార్థులకు కొనసాగించుకునే అవకాశం. విద్య, క్రీడ, వినోద, సాంస్కృతిక, మత, ధార్మిక, రాజకీయ సభలు సమావేశాలకు 100 మంది వరకు ఇప్పటికే అనుమతి. 100 మందికి మించి అనుమతించే విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ. మూసి ఉన్న హాల్స్ లో 50% సీటింగ్ సామర్థ్యంతో గరిష్టంగా 200 మంది వరకే అనుమతి. ఓపెన్ హాల్స్, బహిరంగ ప్రదేశాల్లో గ్రౌండ్ సామర్థ్యాన్ని బట్టి గరిష్ట సంఖ్య నిర్ణయం.
  • ఇప్పటికీ కొనసాగే ఆంక్షల్లో అంతర్జాతీయ విమానయానం. కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు కఠిన లాక్‌డౌన్. అంతర్రాష్ట్ర ప్రజా రవాణా, సరకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవు - కేంద్రం.
  • వైద్య, ఆరోగ్యశాఖ ఆస్పత్రులలో నాడు–నేడు పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష: నాడు–నేడు కార్యక్రమంలో ఆస్పత్రులలో చేపడుతున్న మార్పులతో పాటు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల ప్రస్తుత పరిస్థితిని వివరించిన అధికారులు. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో వైద్య కళాళాలలకు సంబంధించి భూసేకరణతో పాటు, అవసరమైన అన్ని పనులు పూర్తయ్యాయని, టెండర్ల ఖరారుకు జ్యుడీషియల్‌ రివ్యూకు పంపిస్తున్నామని తెలిపిన అధికారులు.
  • సిఎం వైఎస్ జగన్ కామెంట్స్: అన్ని ఆస్పత్రులలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలి. వాటి నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అక్కడ కార్పొరేట్‌ లుక్‌ కనిపించాలి. చరిత్రలో నిల్చిపోయే విధంగా వాటి నిర్మాణం జరగాలి. మూడేళ్లలో అన్ని ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తి కావాలి. ఆ ఆస్పత్రులలో యంత్రాలు, ఏసీలు, లిఫ్ట్‌లు, ఎలక్ట్రికల్, నాన్‌ ఎలక్ట్రికల్‌ ఉపకరణాలు, ఫైర్‌ కంట్రోల్‌ ఎక్విప్‌మెంట్‌ వంటి అన్నింటి నిర్వహణ బాధ్యత ఏడేళ్ల పాటు అప్పగించాలి. తద్వారా ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కారం అవుతుంది. ఆస్పత్రిలో ఓనర్‌షిప్‌ తీసుకోవాలి. తప్పనిసరిగా సెంట్రలైజ్డ్‌ ఏసీ ఉండాలి, డాక్టర్లు ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడే వారు చక్కగా సేవలందించగలుగుతారు. అవసరం అయితే సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం, దాని వల్ల యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.2.50 కే వస్తుంది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో ఆస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయి. అందువల్ల ప్రతి ఆస్పత్రి బెస్టుగా ఉండాలి.
  • చెన్నై హిందూ మున్నని సంస్థ వ్యవస్థాపకుడు రామగోపాలన్ ( 94 ) మృతి . కరోనా మహమ్మారి కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి . 1980 లో హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ మున్నని అనే సంస్థను ఏర్పాటు చేసిన రామగోపాలన్. హిందూ ధర్మ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు ఉద్యమాలను నడిపించిన రామగోపాలన్ . హిందూ మున్నని సంస్థ వ్యవస్థాపకుడు రామగోపాలన్ మృతి సంతాపం తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు .

ప్రభుత్వాలు మారుతున్నాయ్..పాఠశాలలు మారవా..?

Vizianagaram: Schools In Agency Area Face Many Problems, ప్రభుత్వాలు మారుతున్నాయ్..పాఠశాలలు మారవా..?

పాఠశాలలు రేపటి దేశ భవిష్యత్‌కు దివిటీలు లాంటివి. ఒక విద్యార్థికి ప్రాథమిక విలువలు నేర్చుకునేది ఇక్కడే. అతడు ఏ గమ్యం వైపు వెళ్లాలి..ఎటువంటి కెరీర్‌ను ఎంచుకోవాలి అనే అంశాలన్నీంటికి ఇక్కడే రూట్స్ మొదలవుతాయి. పాఠశాల విద్య వ్యక్తులపై, సమాజంపై ఊహించని ప్రభావం చూపుతుంది.  ఇంతలా విద్యార్థలును తీర్చిదిద్దే పాఠశాలలు.. ప్రభుత్వాలు మారుతున్నా వాటి రూపురేఖలను మాత్రం మార్చుకోలేకపోతున్నాయి. నేతలు ఎన్నికల్లో హామీలు తప్ప..ఆ తర్వాత ఐదేళ్లు వాటిని పట్టించుకునే నాథుడే కనిపించడం లేదరు. ఇక ఏజెన్సీలో పాఠశాలల పరిస్థితి వర్ణణాతీతంగా తయారైంది. అక్కడి విద్యను నేర్చుకునే ప్రథమిక హక్కును కూడా కోల్పోయే ప్రమాదంలోకి కనీస సౌకర్యాలు, వసతులు లేని పాఠశాలలు నెట్టివేసేలా కనిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో దయనీయంగా మారిన పాఠశాలల పై టివి9 స్పెషల్ ఫోకస్..

విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు.. ప్రభుత్వ ట్రైబుల్ వెల్ఫర్ పరిధిలో ఉంటాయి.. వీటి పరిస్థితి ప్రస్తుతం దుర్భరంగా తయారైంది. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది పాచిపెంట ప్రభుత్వ ట్రైబుల్ వేల్ఫర్ పాఠశాల.. ఇక్కడ పిల్లలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. ఈ ఆశ్రమ పాఠశాలలో మూడవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు 205 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు. ఈ స్కూల్ పెద్ద గెడ్డ రిజర్వాయర్ దగ్గరలో ఉంటుంది.. స్కూల్ ప్రారంభం నుండి ఇక్కడ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు..

స్కూల్ బిల్డింగ్స్ సరిగా లేక ఉపాధ్యాయులు ఆరుబయట వరండాలలో చదువు చెబుతుంటారు. అంతేకాక స్కూల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో..ఎటువైపు నుంచి పెచ్చులు ఊడి మీద పడతాయో అని విద్యార్థులు నిత్యం భయంతో క్లాసులు వినాల్సిందే. మరోవైపు సరైన వెంటిలేషన్ సదుపాయం లేకపోవటంతో.. చదువుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక, ఆక్సిజన్ అందకపోవటంతో స్టూడెంట్స్ నానా అవస్థలు పడుతున్నారు. అక్కడ అడుగు పెట్టగానే.. చిమ్మ చీకటిలో బోర్డుపై విద్యను బోధిస్తున్న ఉపాద్యాయులు కనిపిస్తుంటారు..వాటిని తడిమి తడిమి చూసుకోని నోట్ చేసుకుంటున్న విద్యార్థలు మనకు తారసపడతారు.  వర్షాకాలంలో పాఠశాల ఉన్న ప్రాంతం ముంపుకు గురవుతూ ఉంటుంది.  ఇక అదే సమయంలో కరెంట్ వైరింగ్ సరిగ్గా లేక.. విద్యుత్ షాక్‌కు గురి అవుతున్నాం అని విద్యార్థులు వాపోతున్నారు.  స్కూల్,  హాస్టల్ ఒకదగ్గరే అవటం వలన హాస్టల్ వసతులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి.. పాఠశాల గదులు సరిగా లేకపోవడంతో హాస్టల్ రూములోనే కొన్నిసార్లు విద్యార్థులకు విద్యను భోధిస్తున్నారు ఉపాధ్యాయులు.. హాస్టల్ సరిపోక రాత్రి సమయాల్లో ఆరుబయట నిద్రిస్తున్న దయనియపరిస్థితి నెలకొంది.. చాలీ చాలని బాత్రూమ్ లు వుండటం తో పక్కనే వున్న పెద్ద గెడ్డ జలాశయానికి వెళ్లి ప్రమాదకరంగా కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు.

కేవలం ఈ ఒక్క పాఠశాల మాత్రమే కాదు..ఏజెన్సీలోనే ఇతర ఆశ్రమ పాఠశాలల్లో ఇంచుమించు ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు సరైన దృష్టి పట్టించుకుంటే తప్ప..ఈ భావిభారత నిర్మాతల కష్టాలు తీరే పరిస్థితులు కన్పించడం లేదు.

Related Tags