రెండు తెలుగు రాష్ట్రాలూ ‘టీవీ9’ డీఎన్‌ఏ

రెండు తెలుగు రాష్ట్రాలూ.. టీవీ9 డీఎన్‌ఏ అన్నారు టీవీ9 నెట్‌వర్క్ సిఈవో బరుణ్ దాస్. టీవీ9 హృదయంలో తెలుగు రాష్ట్రాలకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. 15 ఏళ్ళ క్రితం టీవీ9 ప్రస్థానం మొదలైందని.. రెండు తెలుగు రాష్ట్రాలను మా డీఎన్‌ఏలో శ్వాసలో, సేవలో భాగంగా చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నామన్నారు. 2005లో న్యూస్ ఛానెల్‌గా ప్రారంభమైన.. మీ అభిమాన టీవీ9 నెట్ వర్క్.. ఇప్పుడు అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్‌గా అవతరించిందన్నారు. ప్రస్తుతం అత్యధిక వ్యూయర్‌షిప్‌తో దూసుకెళుతోందన్నారు. దాదాపు 4 […]

రెండు తెలుగు రాష్ట్రాలూ 'టీవీ9' డీఎన్‌ఏ
Follow us

| Edited By:

Updated on: Dec 29, 2019 | 6:45 PM

రెండు తెలుగు రాష్ట్రాలూ.. టీవీ9 డీఎన్‌ఏ అన్నారు టీవీ9 నెట్‌వర్క్ సిఈవో బరుణ్ దాస్. టీవీ9 హృదయంలో తెలుగు రాష్ట్రాలకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. 15 ఏళ్ళ క్రితం టీవీ9 ప్రస్థానం మొదలైందని.. రెండు తెలుగు రాష్ట్రాలను మా డీఎన్‌ఏలో శ్వాసలో, సేవలో భాగంగా చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నామన్నారు. 2005లో న్యూస్ ఛానెల్‌గా ప్రారంభమైన.. మీ అభిమాన టీవీ9 నెట్ వర్క్.. ఇప్పుడు అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్‌గా అవతరించిందన్నారు. ప్రస్తుతం అత్యధిక వ్యూయర్‌షిప్‌తో దూసుకెళుతోందన్నారు.

దాదాపు 4 రాష్ట్రాల్లో, 6 భాషల్లో 6 న్యూస్‌ ఛానెల్స్ ఒక జాతీయ ఛానెల్‌గా విస్తరించింది. ఇప్పుడు మరిన్ని రాష్ట్రాలలో ఛానెల్స్ పెట్టాలన్నది మా లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహా రాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో బెస్ట్ వ్యూయర్ షిప్‌లో మేం చార్ట్ టాపర్స్‌గా నిలిచామని పేర్కొన్నారు. మీ అరుదైన గుర్తింపు టీవీ9 నెట్‌వర్కే. విలువలతో కూడిన వ్యాపారాం చేయాలని చైర్మన్ రామేశ్వర్‌ రావు అన్న మాట నాలో స్ఫూర్తిని నింపింది. 9 మంది వారి జీవితాల్లో ఉన్నత శిఖరాలను సాధించిన వారితో పాటుగా.. మరొకరికి జీవిత సాఫల్య పురస్కారంతో వారిని సత్కరించబోతున్నారు. వీరి కథలు కొన్ని లక్షల మందికి స్ఫూర్తినిస్తాయని భావిస్తున్నానని సీఈవో బరుణ్ దాస్ పేర్కొన్నారు.