కుంటాల మూసివేతపై టీవీ9 ఎఫెక్ట్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో అద్భుత జలపాతం కుంటాల వాటర్‌ఫాల్స్. అయితే గత కొన్ని రోజుల క్రితం కుంటాల జలపాతంలో ఓ వ్యక్తి మరణం కలకలం రేపింది. దీంతో అధికారులు పర్యటకులను జలపాతం వద్దకు వెళ్లకుండా నివారించారు. అయితే, కుంటాల అందాలను చూసేందుకు వచ్చిన చాలా మంది పర్యాటకులు నిరాశతో వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. విషయం టీవీ9కు తెలియటంతో అక్కడి అధికారులతో టీవీ9 బృందం చర్చించింది. అసలు కారణంపై ఆరా తీసింది. సరైనా భద్రతా ప్రమాణాలు పాటించి..జలపాతం దృశ్యాలను చూసేందుకు […]

కుంటాల మూసివేతపై టీవీ9 ఎఫెక్ట్‌
Follow us

|

Updated on: Sep 03, 2019 | 3:39 PM

ఆదిలాబాద్‌ జిల్లాలో అద్భుత జలపాతం కుంటాల వాటర్‌ఫాల్స్. అయితే గత కొన్ని రోజుల క్రితం కుంటాల జలపాతంలో ఓ వ్యక్తి మరణం కలకలం రేపింది. దీంతో అధికారులు పర్యటకులను జలపాతం వద్దకు వెళ్లకుండా నివారించారు. అయితే, కుంటాల అందాలను చూసేందుకు వచ్చిన చాలా మంది పర్యాటకులు నిరాశతో వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. విషయం టీవీ9కు తెలియటంతో అక్కడి అధికారులతో టీవీ9 బృందం చర్చించింది. అసలు కారణంపై ఆరా తీసింది. సరైనా భద్రతా ప్రమాణాలు పాటించి..జలపాతం దృశ్యాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు అనుమతినిచ్చేలా టీవీ9 జరిపిన చర్చలు సఫలం కావటంతో దిగివచ్చిన అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన కంచెను తొలగించారు. తిరిగి యధావిధిగా పర్యాటకులు, స్థానికులు జలపాతం అందాలను చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇదంతా టీవీ9 ఎఫెక్ట్‌ అంటూ పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.