Breaking News
  • వరంగల్‌లో దారుణం. దామెర మండలం ముస్తాలపల్లిలో వ్యక్తి సజీవ దహనం. కాడారి మహేష్‌చంద్ర అనే వ్యక్తిని సజీవదహనం చేసిన దుండగులు
  • శ్రీకాళహస్తిలో ఆర్టీసీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హల్‌చల్‌. సెలవు ఇవ్వలేదని అసిస్టెంట్‌ మేనేజర్‌ వేణుపై దాడి. బస్టాండ్‌లోనే అసిస్టెంట్‌ మేనేజర్‌పై డ్రైవర్‌ దాడి. సీసీ కెమెరాల్లో రికార్డయిన దాడి దృశ్యాలు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపణ తిరుపతి అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేస్తానంటున్న అసిస్టెంట్‌ మేనేజర్‌ వేణు
  • జనగామ: పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవంలో పాల్గొని అఖండ జ్యోతిని వెలిగించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు
  • తమిళనాడు సీఎం పళని స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు. నిన్న రజనీకాంత్‌పై విమర్శలు చేసిన పళని స్వామి. ఈసారి కమల్‌హాసన్‌ను టార్గెట్‌ చేసిన పళని స్వామి. కమల్‌ సంపాదనకోసమే రాజకీయ పార్టీ సంపాదించారు గత పార్లమెంట్‌ ఎన్నికల్లో కమల్‌హాసన్‌ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి. వీళ్లకు రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి .గ్రామ వ్యవస్థ అంటే ఏమిటో తెలుసా-పళని స్వామి
  • హైదరాబాద్‌: రజితారెడ్డి హత్యకేసు. తల్లిన చంపిన కేసులో కీర్తిరెడ్డికి 3 రోజుల పోలీసు కస్టడీ. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న కీర్తిరెడ్డి.
  • విజయవాడ: చిన్నారి ద్వారక హత్యకేసు మిస్టరీ ఛేదించిన పోలీసులు. ద్వారకపై అత్యాచారం చేసి హతమార్చిన పక్కింటి ప్రకాష్‌. ప్రకాష్‌ను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు. ప్రకాష్‌కు ఈ నెల 26 వరకు రిమాండ్‌, సబ్‌జైలుకు తరలింపు
  • హైదరాబాద్‌: కుత్బుల్లాపూర్‌లో అగ్నిప్రమాదం. గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇద్దరు మృతి
  • ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల. గ్రూప్‌-1 పరీక్షల తేదీలు ప్రకటన. ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు గ్రూప్‌-1 పరీక్షలు. మార్చి 17, 18, 19న ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్ల రాత పరీక్షలు. మార్చి 19, 20న డివిజన్‌ అకౌంట్స్‌ ఆఫీసర్ల రాత పరీక్షలు

వేధింపులపై కాల్ సెంటర్?..సై అన్న వైసీపీ : ‘బిగ్ న్యూస్-బిగ్ డిబేట్’

టీడీపీ, వైసీపీ మధ్య మాటలయుద్ధం కొత్త మలుపు తిరిగింది. తమ పార్టీకి చెందిన 14 మంది కార్యకర్తలను చంపేశారనీ, 700 పైచిలుకు కేసులు పెట్టారని టీడీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. చంద్రబాబు ప్రభుత్వం నియమించిన వైస్‌ చాన్సలర్లు, రెక్టార్లపై దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఏపీ గవర్న్‌కి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వ్యక్తిగత దూషణల రాజకీయం నడుస్తోంది. ఈ ఇష్యూపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ ఆధ్వర్యంలో బిగ్ న్యూస్-బిగ్ డిబేట్ వేదికగా కీలక చర్చ జరిగింది.

పోలీసుల వేధింపులు, కేసులపైనా థర్డ్‌పార్టీ కాల్‌సెంటర్‌ ఏర్పాటుకు సిద్ధమా అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి- TV9 బిగ్‌న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో సవాల్‌ విసిరారు. ఈ సవాల్‌ని స్వీకరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ప్రకటించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఇద్దరు నేతలు ఛాలెంజ్‌లు విసురుకున్నారు.