మోదీ మానియాకు ఎదురు లేదా?

దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. అతిపెద్ద ప్రజాస్వామ్యదేశానికి ఎక్కువకాలం పాలించిన కాంగ్రెసేతర పీఎం ఘనత మోదీ సొంతమైంది.

మోదీ మానియాకు ఎదురు లేదా?
Follow us

|

Updated on: Aug 15, 2020 | 6:52 AM

మోదీ మానియాకు ఎదురు లేదా? సుదీర్ఘకాలం పీఎంగా ఘనత కాంగ్రెసేతర పీఎంలలో స్పెషల్‌ డేరింగ్‌ డెసిషన్స్‌… వెల్ఫేర్‌లోనూ టర్నింగ్‌పాయింట్‌

దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. అతిపెద్ద ప్రజాస్వామ్యదేశానికి ఎక్కువకాలం పాలించిన కాంగ్రెసేతర పీఎం ఘనత మోదీ సొంతమైంది. ఇంతకాలం వాజ్‌పేయ్‌ పేరిట ఉన్న రికార్డును మోదీ మంగళవారం అధిగమించారు. అంతేకాదు దేశానికి ప్రధానిగా ఎక్కువకాలం సేవలు అందించినవారి జాబితాలో నాలుగోస్థానం అందుకున్నారు. గుజరాత్‌ సీఎంగా గుర్తింపు పొంది… సమకాలీన దేశ రాజకీయాల్లోనే అత్యంత సమ్మోహన నేతగా ఎదిగారు మోదీ. అంతేకాదు ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. నాడు ఇందిరా.. నేడు మోదీ ఇద్దరూ ఇద్దరే నిర్ణయాల్లో అసాధ్యులు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ భారతావనిలో మోదీ తనదైన ముద్ర వేస్తున్నారు. మరి ఆరున్నరేళ్ల మోదీ పాలన ఎలా ఉంది?

ప్రధానమంత్రిగా 2వేల 270రోజులుగా పూర్తిచేసుకున్న నరేంద్ర మోదీ దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన కాంగ్రెస్‌ యేతర నాయకుడిగా అవతరించారు. అంతకుముందు ఈ రికార్డు వాజ్‌పేయ్‌ పేరుతో ఉండేది. 5ఏళ్ల 13 నెలల 13 రోజులు పాలన సాగించిన దివంగత మాజీPM వాజ్‌ పేయ్‌ 2వేల 268 రోజులు ప్రధానిగా సేవలు అందించారు. బుధవారంతో మోదీ ఈ రికార్డును బద్దలు కొట్టారు. అంతేకాదు. సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్నవారిలో నెహ్రూ, ఇందిరా, మన్మోహన్‌ తర్వాత వరుసల్లో చేరారు మోదీ. నాలుగో నేతగా ఆగస్టు 15న శనివారంఎర్రకోటపై జాతీయ జెండా ఎగరేస్తున్నారు మోదీ.

సమకాలీన రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన PMగా నరేంద్రమోదీ పేరు సంపాదించారు. అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుని దేశానికి దిశానిర్దేశం చేయడమే కాదు.. తన మార్కు రాజకీయాలతో జనాలను కూడా మొప్పించారు. PV సంస్కరణలకు ఆధ్యుడు కావొచ్చు కానీ.. వాటిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మోదీ ముందున్నారు. పాలనాపరంగా ఎన్నో సంస్కరణలు తీసుకోచ్చారు. మన్మోహన్‌ టైంలో బిల్లు పెట్టడానికి కూడా జంకిన సందర్భాలున్నాయి కానీ.. మోదీ అవే బిల్లులను మార్చి… చర్చకు పెట్టి ఆమోదం పొందడంలో విజయం సాధించారు. అందులో GSt ఒకటి. ఆర్ధికంగా వెనకబడినవారికి రిజర్వేషన్లు, మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, డి మానిటైజేషన్, స్వచ్ఛభారత్‌, ఉడాన్‌ యోజనా, కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ఆయుష్మాన్‌ భారత్‌, స్టార్టప్‌ ఇండియా అంటూ మోదీ పథకాలు పెట్టడమే కాదు… వాటిని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లారు. విదేశాంగ విధానంలో గతంలో ప్రధానులు దేశానికి ఖ్యాతి తెచ్చిపెట్టారు. కానీ మోదీ లాగా ప్రాచుర్యం పొందలేదన్నది కొందరి వాదన. విదేశాలకు స్నేహహస్తం అందించడంలో ముందుంటారు. అదే ఎదురు తిరిగితే కఠినంగా సమాధానం కూడా ఇస్తారు. ఇందుకు ప్రస్తుతం చైనాతో జరుగుతున్న వివాదమే నిదర్శనం. సరిహద్దుల్లో కవ్వించిన డ్రాగన్‌కు తగిన బుద్ది చెప్పారు మోదీ. వాణజ్య యుద్ధం ప్రకటించడానికి ఏమాత్రం సంకోచించలేదు. సరిహద్దులో సైనికులను మోహరించడానికి భయపడలేదు. అంతా చైనాతో యుద్ధమా? తట్టుకోగలరా? అని విమర్శలు వచ్చినా నిలబడి మనల్ని చూసి వాళ్లే భయపడేలా చేశారు.

మోదీ నిర్ణయాలపై విమర్శలు లేకపోలేదు.. సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. సరిహద్దులో ఉన్న దేశాలతో వ్యవహరించాల్సిన తీరు అది కాదని.. బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ వంటి చర్యలతో సెంటిమెంట్‌ రెచ్చగొట్టి గెలిచారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోదీకి అవసరం వచ్చినప్పుడల్లా దేశభక్తి నూరిపోసి పబ్బం గడుపుకుంటున్నారని లెఫ్ట్‌ పార్టీల వాదన. ఎవరి విమర్శలు ఎలా ఉన్నా.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో 140 కోట్ల మంది జనాభాకు ప్రస్తుతం కనిపిస్తున్న ఏకైకా జనసమ్మోహనన నాయకుడు… సమర్ధవంతమైన నేత మోదీ అన్నది నిజం. ప్రత్యర్థులు ఆయనకు దరిదాపుల్లో కూడా లేరన్నది ఓపెన్‌ సీక్రెట్‌.

ప్రధానులుగా ఎవరు ఎంతకాలం చేశారంటే… ఆగస్టు13 నాటికి PMగా 2వేల 269రోజులు పూర్తి చేసుకున్న మోదీ సుదీర్ఘకాలం పీఎంగా కాంగ్రెస్‌యేతర లీడర్‌ మోదీ మూడుసార్లు ప్రధానిగా వాజ్‌పేయి సుదీర్ఘ కాలం ప్రధానిగా చేసిన నాలుగో నాయకుడు మోదీ నెహ్రూ, ఇందిరా, మన్మోహన్‌ తర్వాత మోదీ 1996లో కేవలం 13 రోజులు (May 16 and June 1) 1998 నుంచి 13 నెలలు (March 1998 -April 1999) 1999 నుంచి వరుసగా ఐదేళ్లు (1999 -2004) వాజ్‌పేయి పదవిలో ఉన్న రోజులు 2వేల 268 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ జవహర్‌లాల్‌ నెహ్రూ 17 ఏళ్లపాటు ప్రధాని ( ఆగస్టు 15 1947- 26 మే 964) 6వేల 130 రోజులుగా ప్రధానిగా నెహ్రూ రెండోస్థానంలో ఇందిరాగాంధీ 11 ఏళ్లు PMగా పనిచేసిన ఇందిరాగాంధీ జనవరి 24 1966 నుంచి మార్చి 24, 1977 వరకు పీఎం జనవరి 14, 1980 నుంచి అక్టోబర్‌ 31, 1984 వరకు మళ్లీ PM 5వేల 829 రోజులు ప్రధానిగా ఇందిరాగాంధీ 3వేల 656 రోజులు ప్రధానిగా మన్మోహన్‌ సింగ్ మే 22, 2004 నుంచి మే 26, 2014 వరకు మన్మోహన్‌

మోదీ ల్యాండ్‌ మార్క్‌ పథకాలు స్వచ్ఛ భారత్‌ కిసాన్‌ ఫసల్‌ బీమా యోజన కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఉచిత గ్యాస్‌ పంపిణి ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్లు డిమానిటైజేషన్ GST జనధన్‌ యోజన ఉడాన్‌ యోజన డిజిటల్‌ ఇండియా మేకిన్‌ ఇండియా ప్రభుత్వ రంగంలో బ్యాంకుల విలీనం ఆయుష్మాన్‌ భారత్‌ ఆత్మ నిర్భర్‌ భారత్‌

మోదీ డేరింగ్‌ స్టెప్స్ ఇవే…. మయన్మార్‌ స్ట్రైక్స్ బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ ట్రిపుల్‌ తలాక్‌ ఆర్టికల్‌ 370 రద్దు CAA/ NRC రామమందిరం శంకుస్థాపన చైనాతో వాణిజ్య యుద్ధం

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ప్లే ఆఫ్‌కు దగ్గరైన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్లు..
ప్లే ఆఫ్‌కు దగ్గరైన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్లు..
పక్కనే పెట్రోల్ బంకు..కారులోంచి మంటలు..!
పక్కనే పెట్రోల్ బంకు..కారులోంచి మంటలు..!
గాల్లోనే ఢీ కొట్టుకున్న2 మలేషియన్ హెలికాఫ్టర్లు.. 10 మంది మృతి
గాల్లోనే ఢీ కొట్టుకున్న2 మలేషియన్ హెలికాఫ్టర్లు.. 10 మంది మృతి
కుంభరాశిలో ఒంటరిగా శనీశ్వరుడు.. ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు..
కుంభరాశిలో ఒంటరిగా శనీశ్వరుడు.. ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు..
మామిడి పండ్లను తినే ముందు ఎందుకు నానబెట్టాలో తెలుసా.?
మామిడి పండ్లను తినే ముందు ఎందుకు నానబెట్టాలో తెలుసా.?
రోహిత్‌ను పక్కన పెట్టండి.. టీ20 ప్రపంచకప్‌లో కేరళ కుర్రాడిని
రోహిత్‌ను పక్కన పెట్టండి.. టీ20 ప్రపంచకప్‌లో కేరళ కుర్రాడిని
మేష రాశిలో శుక్ర, రవి సంచారం.. ఆ రాశుల వారికి రాజ యోగాలు!
మేష రాశిలో శుక్ర, రవి సంచారం.. ఆ రాశుల వారికి రాజ యోగాలు!
బర్త్‌డే కేక్‌ తిని చిన్నారి మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్..
బర్త్‌డే కేక్‌ తిని చిన్నారి మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్..
ఆయన అభ్యర్థి కాకున్నా.. అన్నితానై జోరుగా ప్రచారం..
ఆయన అభ్యర్థి కాకున్నా.. అన్నితానై జోరుగా ప్రచారం..
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?