మెరుగైన సమాజం కోసం టీవీ9 మరో ముందడుగు

ఢిల్లీ: టీవీ9 భారత్‌వర్ష్ ఛానల్ ప్రారంభ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీవీ9ని అభినందిస్తూ ప్రధాని సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఒక రీజనల్ ఛానల్‌గా ప్రారంభమై ఇన్ని భాషల్లో.. ఇంత విజయవంతంగా టీవీ9 ముందుకు వెళ్లడం నిజంగా గొప్ప విషయమని మోడీ కొనియాడారు. తమ సేవల ద్వారా టీవీ9 దేశానికి సేవ చేస్తుందని మోదీ అన్నారు. సమాజంలోని లోటుపాట్లను ప్రభుత్వాలకు…ప్రభుత్వాల పనితీరు ప్రజలకు దగ్గర […]

మెరుగైన సమాజం కోసం టీవీ9 మరో ముందడుగు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 01, 2019 | 2:52 PM

ఢిల్లీ: టీవీ9 భారత్‌వర్ష్ ఛానల్ ప్రారంభ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీవీ9ని అభినందిస్తూ ప్రధాని సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఒక రీజనల్ ఛానల్‌గా ప్రారంభమై ఇన్ని భాషల్లో.. ఇంత విజయవంతంగా టీవీ9 ముందుకు వెళ్లడం నిజంగా గొప్ప విషయమని మోడీ కొనియాడారు. తమ సేవల ద్వారా టీవీ9 దేశానికి సేవ చేస్తుందని మోదీ అన్నారు. సమాజంలోని లోటుపాట్లను ప్రభుత్వాలకు…ప్రభుత్వాల పనితీరు ప్రజలకు దగ్గర చేయడంలో మీడియా వారధిలా వ్యవహరిస్తుందని చెప్పారు. టీవీ9 సీఈఓ రవిప్రకాష్ లాంటి నిబద్ధత కలిగిన జర్నలిస్టుల అవసరం దేశానికిి  ఉందని అన్నారు. ఈ సందర్భంగా టీవీ9 భారత్‌వర్ష్ జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆయన ఆకాక్షించారు. యువ జర్నలిస్టులకు, యాజమాన్యానికి, సిబ్బందికి ప్రధాని బెస్ట్ విషెస్ తెలిపారు.

టీవీ9 సిఈఓ రవిప్రకాష్ మాట్లాడుతూ…సమాజానికి సేవ చేయాలనే కొద్దిమంది యువ జర్నలిస్టులతో ప్రారంభమైన టీవీ9..ఈ రోజు ఇంత విస్తృతంగా..ఇన్ని విభిన్న ప్రాంతాలకు చేరువ కావడానికి గల కారణం ప్రజల ఆదరణ అని అన్నారు. టీవీ9 భారత్‌వర్ష్ ద్వారా అధిక సంఖ్యలో ప్రజలకు సేవలందించే అవకాశం లభించిందని చెప్పారు. మున్ముందు కూడా సమాజహితానికి టీవీ9 మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. సంస్థను ఇంత విజయపథంలో ముందుకు తీసుకువెళ్లడానికి కారణమైన ప్రతి ఉద్యోగికి రవి ప్రకాష్ ధన్యవాదాలు తెలిపారు.

ఒక్కో మెట్టు ఎక్కుతూ….

మొదట టీవీ9…24 గంటల న్యూస్ ఛానల్ స్టార్ట్ అవుతుందని తెలిసినప్పుడు పెదవి విరిచినవారే ఎక్కువ. ఇన్ని గంటలు ప్రజలకు ఏం చూపిస్తారు? అసలు దీన్ని ఎంతకాలం నడిపిస్తారు..? లాంటి ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి.

కానీ టీవీ9 అసాధ్యాన్ని..సుసాధ్యం చేసి చూపించింది. అడుగు పెట్టింది మొదలు సంచలనాలు సృష్టించింది. సమస్య ఎంత పెద్దదైనా, ఎదుటి మనిషి బలవంతుడైనా.. న్యాయం వైపు నిలబడటం టీవీ9 నైజం. అదే టీవీ9ను అగ్రపథాన నిలబడేలా చేసింది. సమాజంలోని కుళ్లుపట్టిన రాజకీయ వ్యవస్థను ప్రశ్నిస్తూ.. ఆర్థిక, సామాజిక రంగాల్లోని అసమానతలను ప్రభుత్వాలకు ఎత్తి చూపుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ది వైపు నడిపించడానికి అలుపెరగని కృషి చేసింది. దురాచారాలను, మూఢ నమ్మకాలను రూపు మాపడానికి కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేసింది. అందుకే టీవీ9 నెంబర్ వన్‌గా నిలిచింది. ఒక్కో రాష్ట్రానికి తన సేవలను విస్తరించుకుంటూ పోతున్న టీవీ9.. ఇప్పుడు టీవీ9 భారత్‌వర్ష్ పేరుతో జాతీయస్థాయిలో జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అడుగువేస్తుంది. ఈ ప్రయాణంలో కూడా అద్బుత విజయాలు సాధించాలని కోరుకుంటూ.. ఆల్ ది బెస్ట్ టీవీ9 భారత్‌వర్ష్.

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..