టీవీ సీరియల్స్ షూటింగ్స్ మళ్ళీ ఎప్పుడంటే ?

‘టీవీక్షకులకు’ చల్లని కబురు అందించింది వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్.. వారు కొత్త టీవీ షోలను చూడడానికి మహా అయితే ఒక్క నెల ఆగాల్సిందేనట.. ఏక్తా కపూర్ నిర్మించే షోలు, ‘కౌన్ బనేగా కరోడ్ పతి’, ‘బాబూజీ ఘర్ పర్  హై’ వంటివాటి షూటింగులన్నీ జూన్ చివరి వారం నుంచి ప్రారంభమవుతాయని ఈ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బీ.ఎన్.తివారీ తెలిపారు. ఈ షోల ప్రొడ్యూసర్లు తమ షూటింగులను మొదలుపెట్టవచ్చునని, కానీ కొన్ని షరతులు పాటించవలసి ఉంటుందని ఆయన […]

టీవీ సీరియల్స్ షూటింగ్స్ మళ్ళీ ఎప్పుడంటే ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 13, 2020 | 3:16 PM

‘టీవీక్షకులకు’ చల్లని కబురు అందించింది వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్.. వారు కొత్త టీవీ షోలను చూడడానికి మహా అయితే ఒక్క నెల ఆగాల్సిందేనట.. ఏక్తా కపూర్ నిర్మించే షోలు, ‘కౌన్ బనేగా కరోడ్ పతి’, ‘బాబూజీ ఘర్ పర్  హై’ వంటివాటి షూటింగులన్నీ జూన్ చివరి వారం నుంచి ప్రారంభమవుతాయని ఈ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బీ.ఎన్.తివారీ తెలిపారు. ఈ షోల ప్రొడ్యూసర్లు తమ షూటింగులను మొదలుపెట్టవచ్చునని, కానీ కొన్ని షరతులు పాటించవలసి ఉంటుందని ఆయన చెప్పారు. షూటింగ్ లో పాల్గొనే ప్రతి వ్యక్తీ మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని, నటీనటుల్లో గానీ, షూటింగ్ సిబ్బందిలో గానీ ఎవరైనా కరోనాతో మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించవలసి ఉంటుందని ఆయన అన్నారు. షూట్ సమయంలో సెట్స్ పై 50 శాతం సిబ్బందే ఉండాలని, మిగతా వారిని షిఫ్టుల్లో పని చేసేలా చూడాలని తివారీ పేర్కొన్నారు.