‘నా దిష్టిబొమ్మను నా కూతురితోనే దగ్ధం చేసేట్టు చూశావ్ ‘ !

ఒక తండ్రి కోసం ఒక పాప, ఒక తల్లి కోసం మరో పాప తపన పడుతున్న దృశ్యాలను ఆవిష్కరిస్తూ సవ్యంగా సాగిపోతోంది ‘ కార్తీక దీపం ‘ టీవీ సీరియల్. ఎన్ని ఎపిసోడ్లు ప్రసారమవుతున్నా.. ఎప్పటికప్పుడు కేవలం ఈ ఇద్దరి పాపల చుట్టూ తిరుగుతోంది కథ. అటు తన భార్య దీపకు విడాకులు ఇవ్వనున్న డాక్టర్ కార్తీక్.. మరో మలుపులో అతని తల్లి సౌందర్య, తండ్రి ఆనందరావు తమ కొడుకు మనస్సు మార్చడానికి పడుతున్న పాట్లు ఇన్నీఅన్నీ […]

'నా దిష్టిబొమ్మను నా కూతురితోనే దగ్ధం చేసేట్టు చూశావ్ ' !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 16, 2020 | 11:50 AM

ఒక తండ్రి కోసం ఒక పాప, ఒక తల్లి కోసం మరో పాప తపన పడుతున్న దృశ్యాలను ఆవిష్కరిస్తూ సవ్యంగా సాగిపోతోంది ‘ కార్తీక దీపం ‘ టీవీ సీరియల్. ఎన్ని ఎపిసోడ్లు ప్రసారమవుతున్నా.. ఎప్పటికప్పుడు కేవలం ఈ ఇద్దరి పాపల చుట్టూ తిరుగుతోంది కథ. అటు తన భార్య దీపకు విడాకులు ఇవ్వనున్న డాక్టర్ కార్తీక్.. మరో మలుపులో అతని తల్లి సౌందర్య, తండ్రి ఆనందరావు తమ కొడుకు మనస్సు మార్చడానికి పడుతున్న పాట్లు ఇన్నీఅన్నీ కావు. మధ్య మధ్య మౌనిత కూడా కార్తీక్ ని తన సొంతం చేసుకోవడానికి శ్రమ పడుతుంటుంది.

తాజా ఎపిసోడ్ లో ఆమె కనిపించకపోవడంతో టీవీ వీక్షకులు రిలాక్స్ అవుతారు. ఇక..  వంటలక్క దీపను తన తండ్రి కార్తీక్ పెళ్లి చేసుకోవాలని చిన్నారి హిమ, మరోవైపు తన తల్లి దీపతో తండ్రి కార్తీక్ మళ్ళీ కలిసి కాపురం చేయాలనీ, విడాకుల ఊసే ఎత్తరాదని శౌర్య.. ఎవరికి  వారు పంతాల ‘ ప్రయత్నాలు ‘ చేస్తున్నారు . ‘ మీ అమ్మ చచ్చిపోయింది ‘ అంటూ కార్తీక్ గత ఎపిసోడ్ లో కూతురు హిమతో అనడంతో అది విని తట్టుకోలేక హిమ స్పృహ తప్పి పడిపోతుంది. దీపమీద కోపంతో శౌర్య అన్నం తినకుండా అలిగి పడుకుంటుంది. ఇక తాజా ఎపిసోడ్ లో.. ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న హిమ.. దీనంగా .. డాడీ ! ఎవరికి విడాకులు ఇస్తున్నావ్ అని అడుగుతుంది. కానీ కార్తీక్ సమాధానం ఇవ్వకుండా తప్పించు కున్నా.. ప్రామిస్ చెయ్యి అని హిమ రెట్టించి అడుగుతుంది. ఆసుపత్రి బయట కంట తడిపెడుతున్న దీపను ఓదార్చడానికి ప్రయత్నిస్తారు సౌందర్య, ఆనందరావు. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్.. ‘ నీ కడుపు మంట చల్లారిందా ? నా మీద కోపంతో కావాలనే నీ తల్లి బతికి ఉందని చెప్పావ్ !నా కూతుర్ని ఇలా టార్చర్ పెడుతున్నావ్ ‘ అంటూ దీపను  నిలదీస్తాడు. ‘ నా దిష్టిబొమ్మను నా కూతురితోనే దగ్ధం చేసేట్టు చూసావ్ ‘ అని కూడా ఆవేశంగా అంటాడు. ఇలా వాదోపవాదాల అనంతరం సీన్ సౌందర్య ఇంట్లోకి మారుతుంది.  ‘ ఈ శవానికి కూడా ఇస్తాడా విడాకులు ?’ అని దీప అంటున్న డైలాగ్ సూపర్బ్.. అలాగే.. సౌందర్య తన కొడుకు కార్తీక్ తో.. ‘ ఈ కాలంలో తప్పు చేసిన ఆడది తల దించుకోవడంలేదురా ! తల ఎత్తి తిరుగుతోంది..’ అని సెన్సేషనల్ వ్యాఖ్య చేస్తుంది. తల్లీ కొడుకుల మధ్య హాట్ హాట్ సంభాషణ సాగుతుంది. ‘ రేయ్ ! దరిద్రం అంటే ఏంట్రా ? నా కోడల్ని అంతమాట అంటావా ‘ అంటూ సౌందర్య కొడుకు మీద ఫైరయిపోతుంది. ‘ దాని (దీప) సహనం భూమిని రెండుగా చీల్చి నిన్ను కూరుకుపోయేలా చేస్తుంది ‘ అని కసిగా, కోపంగా అంటుంది. ‘ స్త్రీ అంటే శక్తి స్వరూపం.. ఈ లోకానికే ఆదర్శం ‘ అంటూ స్త్రీ శక్తి గురించి వ్యాఖ్యానిస్తుంది.

ఇక తరువాతి ఎపిసోడ్ లో..కార్తీక్.. కూతురు హిమను తన దారిలోకి తెచ్చుకునేందుకు, దీపతో విడాకులు పొందాలన్న తన కోర్కెకు అనుగుణంగా ఆ అమ్మాయి మనస్సు మార్చేందుకు పూనుకొంటాడు. అందుకే.. తానివాళ ఆసుపత్రికి వెళ్లడంలేదని, పూర్తిగా నీతోనే గడపాలని ఉందని అంటాడు. ఈ మాటలకు హిమ ఐసవుతుందా.. తన మనస్సు మార్చుకోవడానికి ప్రయత్నిస్తుందా ? అటు .. మౌనిత ప్లాన్ ఏదైనా ఉందా.. దీప, సౌందర్య ఏం చేయబోతున్నారు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తేలనుంది.

అయితే..దీప.. కార్తీక్ విడాకుల యోచనకు ఎలాంటి ట్విస్ట్ ఇస్తుంది.. మౌనిత ప్లాన్ ని ఎలా నీరు గారేలా చేస్తుందన్నది బహుశా వచ్ఛే ఘట్టంలో తెలుస్తుంది. అలాగే దీప కూతురు శౌర్య కూడా తన తండ్రి డైవోర్స్ ఐడియాకు ఎలా ముగింపునిస్తుందో అన్నది కూడా సస్పెన్స్..

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు