టీవీ చానెల్ రిపోర్టర్ ఆత్మహత్యాయత్నం: పోలీసుల వేధింపులే కారణం..!

Three Boys Died on spot due to Electric Shock in Prakasam District

పోలీసుల వేధింపులు భరించలేకనే.. ఓ చానెల్‌కు చెందిన రిపోర్టర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు ఏ మాత్రం సంబంధంలేని గొడవ గురించి, అనవసరంగా పోలీసులు వేధించారన్న మనస్తాపంతో ఓ టీవీ చానెల్ రిపోర్టర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది.

మల్లాపూర్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఓ ప్రముఖ చానెల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. ఓ చిన్న స్టోర్‌లో జరిగిన గొడవ.. కాస్తా.. తన మెడకు చుట్టుకుంది. ఆ స్టో‌ర్ వివాదంలో రిపోర్టర్ శ్రీనివాస్ ప్రమేయముందని అనుమానించిన పోలీసులు.. అతన్ని పోలీస్ స్టేషన్‌కి పిలిపించి విచారించారు. పీఎస్ నుంచి బయటకొచ్చిన శ్రీనివాస్.. మాత్రం నన్ను పోలీసులు వేధించారని, అవమానించారని, అసలు ఈ గొడవతో తనకు సంబంధం లేదని.. బాధతో.. ఒంటిమీద కిరోసిన్ పోసుకుని, సమీపంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. శ్రీనివాస్‌ని గమనించిన స్థానికులు అతన్ని వారించి.. ఆస్పత్రికి తరలించారు. దీంతో.. ఆగ్రహించిన కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు.

కాగా.. పోలీసులు స్పందించి.. రిపోర్టర్ శ్రీనివాస్‌ని మేము అవమానించేలా మాట్లాడలేదని.. నార్మల్‌గా ఇంటరాగేట్ చేశామని తెలిపారు. అనుమానం వచ్చి గొడవ గురించి అడిగి పంపామని చెబుతున్నారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *