టీవీ నటుడు ఆత్మహత్య.. తీవ్ర విషాదంలో ప్రముఖులు!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీని విషాదాలు అలుముకున్నాయి. ఆర్ధిక భారం లేదా ఆరోగ్య సమస్యలు ఇలా కారణం ఏదైనా వరుసగా నటుల మరణాలు ఫ్యాన్స్‌ను కలిచివేస్తున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో బుల్లితెర నటుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనమైంది. హిందీ సీరియల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కుశాల్ పంజాబీ ఇవాళ ఉదయం బాంద్రాలోని తన ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. ‘ఇష్క్ మే మర్ జావా’ డైలీ సీరియల్‌తో బీ-టౌన్‌లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. […]

టీవీ నటుడు ఆత్మహత్య.. తీవ్ర విషాదంలో ప్రముఖులు!
Follow us

|

Updated on: Dec 27, 2019 | 6:56 PM

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీని విషాదాలు అలుముకున్నాయి. ఆర్ధిక భారం లేదా ఆరోగ్య సమస్యలు ఇలా కారణం ఏదైనా వరుసగా నటుల మరణాలు ఫ్యాన్స్‌ను కలిచివేస్తున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో బుల్లితెర నటుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనమైంది.

హిందీ సీరియల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కుశాల్ పంజాబీ ఇవాళ ఉదయం బాంద్రాలోని తన ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. ‘ఇష్క్ మే మర్ జావా’ డైలీ సీరియల్‌తో బీ-టౌన్‌లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

కాగా, కుశాల్ మరణవార్త తెలియడంతో సహచర నటులంతా తీవ్ర విషాదానికి లోనయ్యారు. ఇకపోతే విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు కుశాల్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ వారికి అతని మృతదేహం దగ్గర సూసైడ్ లెటర్ లభించినట్లు తెలుస్తోంది. ‘తన మరణానికి ఎవరూ బాధ్యులు కారు’ అని అందులో రాసి ఉన్నట్లు వారు తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్లే కుశాల్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.