ఈ సీజన్‌లో పసుపు మంచిదే..

Turmeric, ఈ సీజన్‌లో  పసుపు మంచిదే..

వర్షాకాలంలో అకారణంగా అనారోగ్యం పాలవుతూ ఉంటారు. దీనికి కారణం ఈ సీజన్‌లొ సడెన్‌గా వచ్చే మార్పులే. అయితే కాలానికి తగ్గట్టుగా ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితిని రాకుండా చూసుకోవచ్చు. ఈ సీజన్‌లో ఒక్కసారిగా వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి నీరసం, జలుబు, జ్వరం వంటివి వస్తుంటాయి. అయితే ఇలాంటివి రాకుండా ఆపగలిగే శక్తి మన వంటింట్లో ఎప్పుడూ రెడీ గా ఉండే పసుపుకి మాత్రమే ఉందంటే నమ్మలేం. పలు పరిశోధనల్లో ఇదే విషయం వెల్లడైంది కూడా. సీజనల్ వ్యాధుల్లో ముఖ్యంగా వర్షాకాలంలో సంభవించే పలు అనారోగ్య సమస్యలకు పసుపుతో ఉపశమనం పొందవచ్చని నిర్ధారించారు.

పసుపు,తేనె,కొబ్బరినూనె ఈ మూడింటి మిశ్రమం శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి ఎంతో దోహదం చేస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల మన శరీరంలో ఊహించని మార్పులు చూడొచ్చంటున్నారు నిపుణులు. ఈ మూడిండి మిశ్రమం కేవలం వ్యాధినిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాకుండా, శరీరంలో మెటబాలిజానికి తగినంత శక్తిని కూడా అందిస్తుంది. చర్మం, శిరోజాల సంరక్షణతో పాటు ఈ వర్షాకాలం మెత్తంగా ఆరోగ్య పరమైన అనేక మార్పులు చూడవచ్చంటున్నారు.

కొబ్బరిపాలు,తేనెతో పసుపును కలిపి చేసుకున్న పానీయాన్ని తాగడం ద్వారా వర్షాకాలంలో సహజంగా వచ్చే అనేక అనారోగ్య సమస్యలనుంచి బయటపడే వీలుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి పానీయాలు(డ్రింక్స్ ) ఇప్పుడు మార్కెట్‌లో కూడా రెడీమేడ్‌గా లభ్యమవుతున్నాయి. వీటిని పరిశీలించి వాడుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.
ఏది ఏమైనా మనకు అతి సులభంగా లభించే పసుపుతో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయని ఎప్పట్నుంచో మనకు తెలిసిందే. అయినప్పటికీ సీజన్‌లో వచ్చే అనారోగ్య సమస్యలకు పసుపు చేసే మేలును గుర్తు చేసుకోవడం మంచిదే కదా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *