సందడిగా పుల్లూరు పుష్కర ఘాట్.. భక్తులను ఆకట్టుకుంటున్న గ్రామస్థుల స్వచ్చంద సేవ..

జోగులంబా గద్వాల జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉండవెళ్లి మండలం పుల్లూరు పుష్కర ఘాట్‌ కు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అలంపూర్ యోజకవర్గ పరిధిలో

  • Sanjay Kasula
  • Publish Date - 12:38 pm, Thu, 26 November 20
సందడిగా పుల్లూరు పుష్కర ఘాట్.. భక్తులను ఆకట్టుకుంటున్న గ్రామస్థుల స్వచ్చంద సేవ..

tungabhadra pushkars : జోగులంబా గద్వాల జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉండవెళ్లి మండలం పుల్లూరు పుష్కర ఘాట్‌ కు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అలంపూర్ యోజకవర్గ పరిధిలో ఉన్న నాలుగు పుష్కర ఘాట్లలో పుల్లూరు పుష్కర ఘాట్‌ విశాలంగా ఉండడంతో భక్తుల రద్దీ రోజు రోజుకి పెరుగుతుంది.

భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పుల్లూరు గ్రామ ప్రజల స్వచ్చందంగా అల్పాహారం, భోజన ఏర్పాట్లు, తాగునీటి సదుపాయం కల్పిస్తున్నారు. వాహనాలు నేరుగా పుష్కర ఘాట్ దగ్గరికి వెళుతుంటంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తుంగభద్ర నదిలో స్నానాలుచేయడం, పూజా కార్యక్రమం నిర్వహించడం చేస్తున్నారు. పుష్కర ఘాట్‌ లో ఏర్పాట్లు చాలా బాగున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా అతి పురాతన ఆలయాలు పుల్లూరు గ్రామంలో ఉన్నాయి. భక్తులు ఇక్కడికి రావడానికి మొగ్గు చూపుతున్నారు . మంచి వాతావరణం తుంగభద్ర నదిప్రవాహం ఎక్కువగా ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. తుంగభద్ర నదిలో పుష్కర స్నానం ఆచరిస్తూ పరవశించిపోతున్నారు. నది ఒడ్డున పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నదిలో కార్తీక దీపాలను వదులుతున్నారు. అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండటంతో పుల్లూరు పుష్కరఘాట్‌ కు భక్తులు ఫుల్లుగా తరలి వస్తున్నారు.