మంత్రాలయంలో పవిత్ర తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించిన శ్రీ మఠాధిపతులు.. సామూహిక స్నానాలతో…నిబంధనలకు నీళ్లు

కర్నూలు జిల్లా మంత్రాలయంలో పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్రతీర్థులు కావేరి, కృష్ణ, గోదావరి, పెన్న, బ్రహ్మపుత్రానది సప్త నదుల నీటిని తుంగభద్రలో కలిపి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించారు. తుంగభద్ర నదికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పీఠాధిపతులు పుష్కర పుణ్యస్నానం చేశారు.12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉండటం, రెండో దశ మొదలవ్వడం, నిపుణుల […]

  • Venkata Narayana
  • Publish Date - 3:55 pm, Fri, 20 November 20
మంత్రాలయంలో పవిత్ర తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించిన శ్రీ మఠాధిపతులు.. సామూహిక స్నానాలతో...నిబంధనలకు నీళ్లు

కర్నూలు జిల్లా మంత్రాలయంలో పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్రతీర్థులు కావేరి, కృష్ణ, గోదావరి, పెన్న, బ్రహ్మపుత్రానది సప్త నదుల నీటిని తుంగభద్రలో కలిపి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించారు. తుంగభద్ర నదికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పీఠాధిపతులు పుష్కర పుణ్యస్నానం చేశారు.12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉండటం, రెండో దశ మొదలవ్వడం, నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. భక్తులు నదిలో పుష్కరస్నానాలు ఆచరించేందుకు అనుమతి నిరాకరించింది. అయితే పిండప్రదానాలకు అవకాశం కల్పించింది. కాగా, వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కి నదిలో దిగి సమూహంగా పుణ్య స్నానాలు చేస్తున్నారు భక్తులు.