టీటీడీ సంచలన నిర్ణయం.. ఆ జిల్లా వాసులకే 75 శాతం ఉద్యోగాలు!

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సామాన్యులకు సైతం శ్రీవారి దర్శనం భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో పలు సంస్కరణలు చేసిన టీటీడీ.. తాజాగా తీసుకున్న డెసిషన్‌తో స్థానికులకు వరాల జల్లు కురిపించింది. దేవస్థానం ఉద్యోగాలను భర్తీ చేయడంలో చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆమోద ముద్ర వేసింది. ఇక ఈ రిజర్వేషన్ జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాల వరకు వర్తిస్తుందని టీటీడీ తెలిపింది. లోకల్ రిజర్వేషన్‌కు టీటీడీ పాలకమండలి ఏకగ్రీవంగా […]

  • Ravi Kiran
  • Publish Date - 3:34 pm, Tue, 12 November 19

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సామాన్యులకు సైతం శ్రీవారి దర్శనం భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో పలు సంస్కరణలు చేసిన టీటీడీ.. తాజాగా తీసుకున్న డెసిషన్‌తో స్థానికులకు వరాల జల్లు కురిపించింది. దేవస్థానం ఉద్యోగాలను భర్తీ చేయడంలో చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆమోద ముద్ర వేసింది. ఇక ఈ రిజర్వేషన్ జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాల వరకు వర్తిస్తుందని టీటీడీ తెలిపింది. లోకల్ రిజర్వేషన్‌కు టీటీడీ పాలకమండలి ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేయడమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతికి కూడా పంపారు. అయితే దీనిపై ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా, టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి చిత్తూరు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.