రేపు సూర్యగ్రహణం.. శ్రీవారి దర్శనాలు రద్దు..

అమావాస్య నాడు భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణము ఏర్పడుతుంది. రేపు (ఆదివారం) సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాగా

రేపు సూర్యగ్రహణం.. శ్రీవారి దర్శనాలు రద్దు..
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2020 | 2:34 PM

TTD reopen temple: అమావాస్య నాడు భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణము ఏర్పడుతుంది. రేపు (ఆదివారం) సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాగా.. వలయాకారంలో కనువిందు చేయనుంది. ఉదయం 9:15 గంటలకు గ్రహణం ప్రారంభమై, మధ్యాహ్నం 3.04 గంటలకు ముగుస్తుంది. ఈ క్రమంలో తిరుమలలోని శ్రీవారి ఆలయం ఆదివారం మూసివేయనున్నారు. శనివారం రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ అనంతరం శ్రీవారి ఆలయ తలుపులు మూసి వేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ఆదివారం మధ్యాహ్నం గ్రహణం వీడిన తర్వాత ఆలయాన్ని తెరుస్తామని వారు వెల్లడించారు. మ‌ధ్యాహ్నం నుంచి రాత్రి వరకు శ్రీవారి నిత్య సేవలు సుప్ర‌భాతం, శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, తోమాల సేవ, కొలువు, ఏకాంతసేవ నిర్వ‌హిస్తామన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 21న పూర్తిగా శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఉండ‌దని అధికారులు తెలిపారు.

Also Read: ఆన్‌లైన్‌ బోధనకోసం ‘విద్యాదాన్’