తప్పుడు ప్రచారంపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు

తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం హెచ్చరించింది. సప్తగిరి పుస్తకంతో పాటు అన్యమతానికి చెందిన ఓ పుస్తకం పంపింణీ...

తప్పుడు ప్రచారంపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు
Follow us

|

Updated on: Jul 07, 2020 | 12:32 PM

TTD Complained to The Police : తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం హెచ్చరించింది. సప్తగిరి పుస్తకంతో పాటు అన్యమతానికి చెందిన ఓ పుస్తకం పంపింణీ జరిగిందనే వార్తలపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది టీటీడీ బోర్డు.

దేవస్థానం ప్రతిష్టను దెబ్బ తీయడానికి కొంతమంది కావాలని చేసిన కుట్రగా భావిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. సప్తగిరి మాసపత్రికను పాఠకుడికి పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ జరుగుతుందని తెలిపారు. సప్తగిరి మాస పత్రికను పోస్టల్ శాఖ ‘బుక్ పోస్ట్’‌లో పంపుతుంది కాబట్టి ఎలాంటి సెల్ ఉండదని స్పష్టం చేశారు. సప్తగిరి మాసపత్రిక ప్యాకింగ్, డెలివరీ మొత్తం పోస్టల్ శాఖ చూస్తుందన్నారు. ఈ కుట్రపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను కోరారు.