Breaking News
  • భారతదేశంలో ఉన్న సార్స్ కోవీడ్ 2 సంబందించి రెండు వేలకు పైగా ఉన్న జన్యు క్రమలపై ccmb పరిశోధన. పరిశోధనలు ప్రకారం భారతదేశం లో 70 శాతం ఉన్న A2A రకం ఉందన్న సీసియబి. ప్రపంచ వ్యాప్తంగా ఏ టి ఏ రకం ఎక్కువగా ఉంది- రాకేష్ మిశ్రా, సీసియంబి డైరెక్టర్. ఇదొక సానుకూలాంశం - రాకేష్ మిశ్రా, సీసియంబి డైరెక్టర్. ఈ మ్యుటేషన్ లక్ష్యంగా చేసుకున్న వాక్సిన్ లేదా డ్రగ్ ప్రపంచ వ్యాప్తంగా ఒకే ప్రభావం చూపుతాయి - రాకేష్ మిశ్రా, సీసియంబి డైరెక్టర్. 18 శాతం మాత్రమే A3I రకం ఉందని అంటున్న సీసీయంబి. జూన్ లో A3I రకం 41 శాతం ఉంది. డా. దివ్య తేజ్, సీసియంబీ సైంటిస్ట్. RDRP అనే కీలకమైన ప్రోటీన్ లో మ్యుటేషన్ ఉండడంవల్ల మిగతా రకాల కన్నా A3I రకం వ్యాప్తి తక్కువగా ఉంటుందని ccmb భావిస్తోంది. A2A లోని స్పైక్ ప్రోటీన్ లో D614G అనే మ్యుటేషన్ వల్ల ఎక్కువ వ్యాప్తి జరిగిందని పరిశోధనల్లో తేలింది. ఏ రకం ఎంత తీవ్రమైనది అన్నది ఖచ్చితంగా ఎక్కడా చూపించబడలేదంటున్న సీసియబి.
  • తిరుమల లో విమానం వెళ్లిన మాట వాస్తవమేనని ప్రకటించిన ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్. విమానయాన శాఖ కు చెందిన నావిగేషన్ సర్వే విమానం తిరుమల మీదుగా వెళ్ళింది. అయితే..తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానం వెళ్ళలేదు. ఆలయానికి కొద్దిగా దూరం నుంచి ప్రయాణించింది.. తిరుమల పై విమాన రాకపోకలకు ఎలాంటి ఆంక్షలు లేవు. నో ఫ్లై జోన్ గా ప్రకటించలేమని గతంలో కేంద్రం స్పష్టం చేసింది. అయినప్పటికీ అనధికారికంగా తిరుమల నో ఫ్లై జోన్ గా కొనసాగుతోంది...ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్.
  • అమరావతి ట్విటర్ లో పవన్ కళ్యాణ్. అమరావతి రైతుల పక్షాన ఏపీ హైకోర్టు లో అఫిడవేట్ దాఖలు చేయనున్న జనసేన. ఈ బాధ్యతలను జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ తమ్మి రెడ్డి శివశంకర్ కు అప్పగింత.
  • రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు నేతృత్వంలో ఉపరాష్ట్రపతి నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం. హాజరైన డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్. పార్లమెంట్ సమావేశాల కుదింపు, రాజ్యసభలో వ్యవసాయ సంబంధ బిల్లుల ఆమోదం సందర్భంగా జరిగిన ఆందోనలుపై చర్చ జరిగే అవకాశం.
  • కాంగ్రెస్ పార్టీపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన రాజ్యసభ. రైతు బిల్లులపై చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించిన విజయసాయి రెడ్డి. కాంగ్రెస్‌ను దళారుల పార్టీగా అభివర్ణించిన విజయసాయి రెడ్డి. విజయసాయి మాటలపై అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్. కొద్దిసేపు రభసకు దారితీసిన విజయసాయిరెడ్డి విమర్శలు. రికార్డులను ఆ విమర్శలను తొలగించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు నిర్ణయం.
  • ప.గో: ద్వారకాతిరుమలలో ఏపీలోని 13 జిల్లాల కాపు జేఏసీ నేతల సమావేశం. రేపు కిర్లంపూడిలో ముద్రగడను కలిసి రాష్ట్ర కాపు జేఏసీకి నాయకత్వం వహించాలని కోరనున్న కాపునేతలు. కాపు జేఏసీ ముద్రగడ నాయకత్వంలోనే ముందుకు వెలుతుంది, ఆయనే మా నాయకుడు. రాష్ట్రంలో ఎన్ని కాపు సంఘాలు ఉన్న వాటి ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్ సంకల్పం. కాపు సంక్షేమం, అభివృద్ధి కోసం ఎవరు పాటుపడినా కాపు జేఏసీ స్వాగతిస్తుంది. రాష్ట్రం గర్వపడే ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. ముద్రగడ నాయకత్వంలోనే రిజర్వేషన్ సాధ్యమవుతాయని కాపు జేఏసీ నేతల తీర్మానం.
  • నా 60 సంవత్సరాల రాజకీయ అనుభవంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఎప్పుడూ బిల్లుల ఆమోదం జరగలేదు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రభుత్వానికి పూర్తి పక్షపాతంగా వ్యవహరించారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలకు, స్టాట్యుటరీ తీర్మానాలను డిప్యూటీ చైర్మన్ నిబంధనలకు వ్యతిరేకంగా తోసిపుచ్చారు. రాజ్యాంగానికి, నిబంధనలకు వ్యతిరేకంగా అధికారపక్షం వ్యవహరించినందుకు మా నిరసన సభలోనే తెలియజేసాము. డిప్యూటీ చైర్మన్ వ్యవహారశైలిని నిరసిస్తూ అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చాము. 12 పార్టీల మద్దతుతో 50 మంది ఎంపీల సంతకాలతో డిప్యూటీ చైర్మన్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాము. డిప్యూటీ చైర్మన్ కి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసులు పెండిగులో ఉండగా ఆయన సభ అధ్యక్షుడి హోదాలో కొనసాగే అవకాశం లేదు. కే. కేశవరావు, టీఆరెస్ పార్లమెంటరీ పార్టీ నేత.

పాతనోట్లను మార్చాలని కేంద్రానికి టీటీడీ వినతి

టీటీడీ దగ్గర పేరుకుపోయిన కోట్లాది రూపాయల పాతనోట్లు మార్చాలని మరోసారి వైవి సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
Ttd chairman Subbareddy asked center to exchange the old notes, పాతనోట్లను మార్చాలని కేంద్రానికి టీటీడీ వినతి

తిరుమల తిరుపతి దేవస్థానం వినతులపై కేంద్రం నుంచి స్పందన కరువైంది. పాతనోట్ల మార్పిడిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. టీటీడీ దగ్గర పేరుకుపోయిన కోట్లాది రూపాయల పాతనోట్లు మార్చాలని మరోసారి వైవి సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

2016లో వెయ్యి, ఐదొందల నోట్లు రద్దు చేసినప్పటి నుంచి టీటీడీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించినా.. పాతనోట్ల ప్రవాహం ఆగలేదని తెలిపారు. ఆ తర్వాత కూడా స్వామి హుండీ ద్వారా పాతనోట్లు కానుకగా వచ్చాయన్నారు. భ‌క్తుల మ‌నోభావాల‌తో ముడిప‌డిన అంశం కావ‌డంతో ఈ నోట్లను హుండీలో స‌మ‌ర్పించ‌కుండా నిరోధించే ఏర్పాట్లు చేయలేకపోయాని కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

అనేక బ్యాంకుల్లో లావాదేవీలు జ‌రుపుతున్న టీటీడీ హుండీ ద్వారా ల‌భించే కానుక‌ల‌కు ప‌క్కాగా రికార్డులు నిర్వహిస్తోంద‌ని వివరించారు. పాత‌నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి 2017 నుంచి టీటీడీ అనేక‌సార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ‌, రిజ‌ర్వు బ్యాంకుకు లేఖ‌లు రాసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుని పాత నోట్లను రిజ‌ర్వు బ్యాంకులో గానీ లేదా ఏ ఇత‌ర బ్యాంకుల్లోనైనా డిపాజిట్ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాల‌ని టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి కోరారు.

Ttd chairman Subbareddy asked center to exchange the old notes, పాతనోట్లను మార్చాలని కేంద్రానికి టీటీడీ వినతి

నిజానికి నాలుగేళ్ల కిందటే పాతనోట్లు రద్దు అయిపోయాయి. కనీసం ఇప్పుడు చూద్దామన్నా కన్పించడం లేదు. ఆ నోట్లు ఇప్పుడు చిత్తు కాగితాలతో సమానం. కానీ తిరుమల శ్రీవారి దగ్గర అలాంటి నోట్లు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. 2016 నవంబర్‌ 8న దేశంలో ఐదొందలు, వెయ్యి నోట్లు చెల్లవని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత భక్తులు చాలా వరకు ఆ నోట్లను స్వామివారి హుండీలో వేశారు. పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని చెప్పినా దానికి కొన్ని నిబంధనలు పెట్టారు. దీంతో కొందరు ఆ పాతనోట్లను స్వామివారి హుండీలో పడేశారు.

ఇలా కోట్లాది రూపాయల పాతనోట్లు టీటీడీ దగ్గర పేరుకుపోయాయి. ప్రధాని ప్రకటన తర్వాత తిరుమల కొండపై టికెట్ల బుకింగ్‌ మొదలుకొని ప్రసాదాల అమ్మకాల వరకు పాతనోట్లను తీసుకోవడం మానేశారు. అయినా ఆ నోట్లన్నీ హుండీలోకి చేరిపోయాయి. ఇలా టీటీడీకి భక్తుల నుంచి వచ్చిన 18కోట్ల రూపాయల విలువైన వెయ్యినోట్లు, 30 కోట్ల 17లక్షల రూపాయల 500నోట్లు కానుకగా వచ్చాయి.

Ttd chairman Subbareddy asked center to exchange the old notes, పాతనోట్లను మార్చాలని కేంద్రానికి టీటీడీ వినతి

ఇక తిరుమల ఆలయ భద్రత కోసం నియమించుకున్న ఎస్‌పీఎఫ్‌ విభాగానికి బకాయి ఉన్న జీఎస్టీని రద్దు చేయాలని వైవీ సుబ్బారెడ్డి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఈ బకాయిలు మొత్తం 23 కోట్ల 78 లక్షలు ఉన్నాయి. ఈ జీఎస్టీని రద్దు చేస్తే ఆ డబ్బులతో మరిన్ని సామాజిక, విద్య, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తిరుమలలో సెక్యూరిటీ కోసం నియమించుకున్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగానికి 2014, ఏప్రిల్ 1 నుంచి 2020 జూన్ 30 వరకు జీఎస్టీ రూపంలో 23 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. మరి ఈసారైనా పాతనోట్లు, జీఎస్టీ వినతులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందో లేదో చూడాలి.

Related Tags