బ్యాంకులకు టీటీడీ బంఫర్‌ ఆఫర్‌ !

ఆధ్యాత్మీక దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకన్నకు భక్తులు సమర్పించిన చిల్లర నాణేలు మోయలేని భారంగా మారిందట. గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న చిల్లర నాణేలు దాదాపు రూ. 20 కోట్ల 50 లక్షలకు చేరుకున్నాయని టీటీడీ అధికారి ధర్మారెడ్డి తెలిపారు. అయితే, ఇంత పెద్ద మొత్తంలో నగదు చిల్లర రూపంలో ఉండటంతో ఏం చేయాలో అధికారులుకు అర్థం కాక తలలు పట్టుకున్నారట. అయితే, నాణేల మార్పిడిపై అన్ని జాతీయ బ్యాంకులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చిన అధికారులు..నాణేలు […]

బ్యాంకులకు టీటీడీ బంఫర్‌ ఆఫర్‌ !
Follow us

|

Updated on: Aug 17, 2019 | 2:22 PM

ఆధ్యాత్మీక దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకన్నకు భక్తులు సమర్పించిన చిల్లర నాణేలు మోయలేని భారంగా మారిందట. గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న చిల్లర నాణేలు దాదాపు రూ. 20 కోట్ల 50 లక్షలకు చేరుకున్నాయని టీటీడీ అధికారి ధర్మారెడ్డి తెలిపారు. అయితే, ఇంత పెద్ద మొత్తంలో నగదు చిల్లర రూపంలో ఉండటంతో ఏం చేయాలో అధికారులుకు అర్థం కాక తలలు పట్టుకున్నారట. అయితే, నాణేల మార్పిడిపై అన్ని జాతీయ బ్యాంకులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చిన అధికారులు..నాణేలు తీసుకున్న బ్యాంకులకు ఆఫర్‌ ఆఫర్‌ ప్రకటించారట. అదేంటంటే..ఏ బ్యాంకు అయితే నాణేల మార్పిడికి ముందుకు వస్తుందో..వారు టీటీడీ నాణేలు తీసుకుని నగదు తమ అకౌంట్‌లోకి క్రెడిట్‌ చేయాలని అలా చేసిన సదరు బ్యాంకుకు టీటీడీ తరపున ప్రస్తుతం ఉన్న కార్డు రేటుపై సుమారు మూడేళ్ల పాటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు టీటీడీ స్కీంకు అంగీకరించి పలు బ్యాంకులు ముందుకు వచ్చినట్లుగా టీటీడీ స్పష్టం చేసింది. ఈ మేరకు సదరు బ్యాంకులు తమకు లిఖిత పూర్వక హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. మరో పదిరోజుల్లో నాణేలను తీసుకెళ్తామని చెప్పినట్లుగా వెల్లడించారు. ఆగస్టు నెలాఖరుకల్లా చిల్లర నాణేల మార్పిడి జరిగిపోతుందన్నారు. పరకా మణిలో పేరుకుపోయిన చిల్లర గుట్టలను తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టీటీడీ అధికారి ధర్మారెడ్డి తెలిపారు.