Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ చేసిన నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు అందర్నీ పాస్ చేసినట్టు ప్రకటించింది.
  • కరోనా వైరస్‌ను నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా పని చేస్తున్నదని అన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

TTD shocks devotees: శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్… అలిపిరి దాటాలంటే..?

తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారికి షాకిచ్చింది టీటీడీ ట్రస్టు బోర్డు. శనివారం సమావేశమైన టీటీడీ బోర్డు.. కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో శ్రీవారి భక్తులకు షాకిచ్చే నిర్ణయం కూడా వుంది.
ttd board shocks devotees, TTD shocks devotees: శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్… అలిపిరి దాటాలంటే..?

TTD trust board has shocked Sri Venkateshwara devotees: తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారికి షాకిచ్చింది టీటీడీ ట్రస్టు బోర్డు. శనివారం సమావేశమైన టీటీడీ బోర్డు.. కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో శ్రీవారి భక్తులకు షాకిచ్చే నిర్ణయం కూడా వుంది.

టీటీడీ బోర్డు ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలోని ట్రస్టు బోర్డు శనివారం తిరుమలలో సమావేశమైంది. వార్షిక బడ్జెట్ మొదలుకుని పలు కీలక నిర్ణయాలను సుబ్బారెడ్డి బృందం తీసుకుంది. 2020-21 సంవత్సరానికిగాను 3309 కోట్ల అంచనాలతో బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది బోర్డు. బూంది పోటులో అగ్నిప్రమాదాల నివారణకు 3.3 కోట్ల రూపాయలతో థర్మో ప్లూయిడ్స్ స్టవ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూ పార్కు వద్ద 14 కోట్లతో ప్రతిభావంతులకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని, 16 కోట్లుతో అలిపిరి-చెర్లోపల్లి రోడ్డు విస్తరణ చేయాలని బోర్డు నిర్ణయాలు తీసుకుంది.

8.5 కోట్లతో బర్డ్ అభివృద్ధికి నిధులు కేటాయించారు. బర్డ్ ఆస్పత్రిలో అవసరం మేరకు ఉద్యోగాల నియామకానికి అనుమతులు జారీ చేసింది. 34 కోట్లతో యస్వీ బదిర పాఠశాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. టిటిడి విజిలెన్స్ విభాగంలో సెక్యూరిటి గార్డుల నియామకానికి ఆమోదం తెలిపారు. టిటిడి పరిధిలోని ఆలయాలలో 1300 సిసి కెమెరాలు ఏర్పాటుకు అనుమతించారు. 3.92 కోట్ల రూపాయల వ్యయంతో చెన్నైలో అమ్మవారి ఆలయం నిర్మాణం చేయాలని నిర్ణయించి, నిధుల కేటాయింపునకు అమోదం తెలిపారు.

ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేయాలని, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆలయంలో అభివృద్ధికి నిధులు కేటాయించాలని బోర్డు సమావేశం నిర్ణయించింది. శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం పలు నిర్ణయాలు తీసుకున్న టీటీడీ బోర్డు అలిపిరి టోల్ గేట్ వద్ద టోల్ రుసుం పెంచుతూ నిర్ణయించి భక్తులకు చేదు వార్త వినిపించింది. గరుడ వారధి పిల్లర్లపై శ్రీవారి నామాల ముద్రణ నిలిపివేశామని, శ్రీవారి నామాలపై నుంచి వాహనాలు వెళ్లడం మంచిది కాదని భక్తులు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Related Tags