టీటీడీ పాలక మండలి సభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

Tirmula Tirupati Devastanam, టీటీడీ పాలక మండలి సభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రమాణస్వీకారం
టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ప్రభుత్వ విప్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం రాత్రి కుటుంబ సమేతంగా అలిపిరి నడక మార్గంలో కాలినడకన తిరుమల చేరుకున్న ఆయన, శనివారం ఉదయం ఆలయంలోకి వెళ్లే ముందు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్‌ సన్నిధిలో చెవిరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. టీటీడీ జేఈఓ బసంత్‌ కుమార్‌ చెవిరెడ్డితో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో పండితులు చెవిరెడ్డి కుటుంబానికి వేద ఆశీర్వాచనం చేయగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి భక్తులకు రెండోసారి బోర్డు సభ్యుడిగా సేవచేసే అవకాశం కలగడం సంతోషంగా ఉందని, ఎలాంటి పక్షపాతం, భయం లేకుండా టీటీడీ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెవిరెడ్డి స్పష్టం చేశారు. జంబో పాలక మండలి కూర్పుపై బీజేపీ చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యాలపై సున్నీతంగా స్పందించారు. శ్రీవారి అనుగ్రహం లేనిదే ఆయన దర్శనం కూడా లభించదని, అలాంటిది భక్తులకు సేవ చేసే పాలక మండలిలో తొలిసారి 36 మంది సభ్యులకు అవకాశం కలగడం వెనుక భగవంతుడి కృఫ ఖచ్చితంగా ఉందన్నారు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *