కరెంట్ చార్జీలు పెంచలేదు: విద్యుత్ శాఖ

తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెంచారన్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. కరెంట్ బిల్లులు ఒక్క రూపాయి పెంచలేదన్న ఆయన.. ప్రస్తుత స్లాబ్స్ ప్రకారమే చార్జీలు వసూలు చేస్తున్నామన్నారు.

కరెంట్ చార్జీలు పెంచలేదు: విద్యుత్ శాఖ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 06, 2020 | 6:46 PM

తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెంచారన్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. కరెంట్ బిల్లులు ఒక్క రూపాయి పెంచలేదన్న ఆయన.. ప్రస్తుత స్లాబ్స్ ప్రకారమే చార్జీలు వసూలు చేస్తున్నామన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలలకు గానూ పాత రీడింగ్ ప్రకారమే అంచనా బిల్లులు మాత్రమే వసూలు చేశామన్నారు. ఈ నెల ఇంటింటికి వెళ్లి రీడింగ్ తీసి బిల్లులు ఇస్తున్నామని తెలిపారు. ఈ సమ్మర్‌లో విద్యుత్ వినియోగం పెరిగిన కారణంగా వినియోగదారులకు స్లాబులు మారాయన్నారు. గృహ వినియోగం పెరిగడంతోనే స్లాబు చార్జీలు మారాయని స్పష్టం చేశారు రఘుమారెడ్డి. రీడింగ్‌లో గానీ, బిల్లులో గానీ ఎక్కడా తప్పిదాలు జరగలేదన్న ఆయన.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదన్నారు. ఎక్కడైన తప్పులు జరిగితే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని రఘుమారెడ్డి చెప్పారు.