ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ స్పీడు.. బురదలో పడ్డ మాజీ ఎమ్మెల్యే..!

TSRTC strike effect.. CPM Ex mla sunnam rajaiah narrow escape from bus accident, ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ స్పీడు.. బురదలో పడ్డ మాజీ ఎమ్మెల్యే..!

తెలంగాణ ఆర్టీసీ సమ్మె.. ఉదృతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవర్లను నియమిస్తోంది. వీరిలో చాలా మందికి అనుభవం లేకపోవడంతో పలు ప్రమాదాలకు దారితీస్తోంది. తాజాగా ఈ ప్రైవేట్ డ్రైవర్ స్పీడ్‌‌కు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య బురదలో పడ్డారు. సోమవారం రాత్రి భద్రాచలం డిపో నుంచి కూనవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. అదే మార్గంలో వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య బైక్‌ను ఓవర్ టేక్ చేయబోయింది. అయితే అది గమనించిన సున్నం రాజయ్య.. తన బైకును పక్కకు తిప్పబోయారు. అయితే బైక్ స్పీడ్ కంట్రోల్ తప్పడంతో.. పక్కనే ఉన్న బురద గుంటలో పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రేఖపల్లి వద్ద బస్సును అడ్డుకున్నారు. అందులో ఉన్న డ్రైవర్‌ను మందలించి పంపించారు. అయితే ఈ ఘటనపై రాజయ్య భద్రాచలం డిపో డీఎంకు సమాచారం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *