Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కార్మికుడు..మృతి

Bus Conductor Loses Mental Balance, మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కార్మికుడు..మృతి

ఆర్టీసీ కార్మికుల ఆకలి చావులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నవంబర్‌ 13న మహబూబాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌ నరేష్‌ పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా మరో కార్మికుడు తీవ్ర మనస్తాపంతో మృత్యువాతపడ్డాడు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నవంబర్‌ 5వ తారీఖు డెడ్‌లైన్‌ అంటూ టీవీలో వచ్చిన ప్రభుత్వ ప్రకటనను చూస్తూ సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన ఆర్టీసీ కార్మికుడు నాగేశ్వర్‌ రావు మతిస్థిమితం కొల్పోయాడు. అప్పటి నుంచి నాగేశ్వర్‌రావు తనకు తానే నవ్వుతూ, ఏడుస్తూ ఉండిపోయాడు. నారాయణఖేడ్‌ డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా నాగేశ్వర్‌రావు విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వ తీరుతో ఉద్యోగం పోయిందనే మనస్తాపంతో..పిచ్చివాడైపోయిన నాగేశ్వర్ రావుకు అప్పట్నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం అతడు చికిత్స పొందుతూ మృతిచెందినట్లుగా వైద్యులు వెల్లడించారు.
నాగేశ్వర్‌ రావు మృతితో ఆయన కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. మృతుడి స్వస్థలం ఘానాపూర్‌ గ్రామం కాగా, పిల్లల చదువుల కోసం గతంలో సంగారెడ్డిలో అద్దె ఇంట్లో ఉంటున్న నాగేశ్వర్‌రావు ఫ్యామిలీ..సమ్మె కారణంగా జీతాలు లేక, ఇంటి అద్దె కట్టలేని స్థితిలో జోగిపేటలోని అత్తవారింట్లోనే ఉంటున్నారు. కొన్ని రోజులుగా ఉద్యోగ ఆందోళనతో అనారోగ్యానికి గురైన తన తార్నాకలోని ఆర్టీసీ భీమా ఆస్పత్రికి తీసుకెళ్తే అక్కడి వైద్యులు పట్టించుకోలేదని నాగేశ్వర్‌రావు భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త కోలుకుంటాడని, తిరిగి ఉద్యోగంలో చేరి తమ కుటుంబం సంతోషంగా ఉంటుందని ఆశపడ్డ తమకు నిరాశే మిగిలిందని ఆ ఇల్లాలు రోధించింది. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంది.