Breaking News
 • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
 • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
 • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
 • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
 • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
 • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
 • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

ఆర్టీసీ కార్మికుల పోరుబాట… మరో సకలజనుల సమ్మె?

తెలంగాణ ఈనెల 21 నుంచి పోరు తెలంగాణగా మారుతోంది. ఆర్టీసీ సమ్మెతో ఏకతాటిపైకి రాబోతోంది. కేసీఆర్ సర్కారుకు సెగ పుట్టించేలా ఆర్టీసీ కార్మికులు – ప్రజాసంఘాలు – రాజకీయాలు పార్టీలు కలిసి జేఏసీగా ప్రత్యక్ష ఉద్యమకార్యాచరణకు దిగబోతున్నాయి. ఈ పరిణామం తెలంగాణలో మరో సకలజనుల సమ్మెకు పురుడుపోస్తుందనే టెన్షన్ ప్రభుత్వ వర్గాలను పట్టి పీడిస్తోంది..

ఈనెల 21న ఆర్టీసీ కార్మికులు పోరుబాటకు శ్రీకారం చుడుతున్నారు.

 • 21న డిపోల ముందర కుటుంబాలతో ధర్నాకు ప్లాన్ చేశారు.
 • 22న తాత్కాలిక డ్రైవర్లతో ములాఖత్ – ఉద్యోగాలకు వెళ్లొద్దని వినతలు ఇస్తారు.
 • 23న ప్రజాప్రతినిధులను కలిసి సమ్మెకు మద్దతు తెలుపాలని – ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతారు
 • 24న మహిళా కండక్టర్లతో డిపోల ఎదుట ధర్నాలు
 • 25న రాస్తారోకోలు – రహదారుల దిగ్భంధనం
 • 26న కార్మికుల పిల్లలతో ధర్నాలు
 • 27న దీపావళి పండుగ చేసుకోకుండా నిరసన
 • 28న కోర్టులో కేసు వాదనలు చేయాలని నిర్ణయం
 • 30న 5 లక్షల మందితో సకలజనుల సమరభేరి నిర్వహించడం..

ఈ పది రోజుల ఆర్టీసీ కార్మికుల ఉద్యమం తెలంగాణలో మరో  సకలజనుల సమ్మెగా రూపం దాల్చుతోంది.  మిలియన్ మార్చ్ ను 30న 5 లక్షల మందితో సకలజనుల సమరభేరి మళ్లీ చేయాలని ఆర్టీసీ కార్మికులు తలపోయడం తెలంగాణలో అగ్గి రాజేస్తోంది..ఇదే జరిగితే తెలంగాణలో శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం లేకపోలేదు.

తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబసభ్యులతో కలిసి ధర్నా చేపట్టారు. ఆర్టీసీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని వరంగల్ బస్ డిపో ఎదుట ధర్నా చేస్తున్న కార్మికుల కుటుంబ సభ్యులు కోరారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 17వ రోజుకు చేరింది. సోమవారం కార్మికులు తమ కుటుంబసభ్యులతో కలిసి డిపోలముందు నిరసన చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 4,200 మంది కార్మికులు తమ కుటుంబసభ్యులతో ఆయా డిపోలవద్ద ధర్నాకు దిగారు.

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఖమ్మం జర్నలిస్టులు మద్దతు పలికారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి బస్ డిపో వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. సమ్మె పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా జర్నలిస్టులు ర్యాలీలో నోటికి నల్ల గుడ్డలతో, నల్ల జెండాలు చేబూని ప్రదర్శన చేశారు. డిపో వద్ద ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికుల వద్దకు వెళ్లి టీజేఎఫ్ నాయకులు సంఘీభావం ప్రకటించారు.

తెలంగాణలోని ముసలి ముతక – చిన్నా పెద్ద – ఉద్యోగులు – ఉపాధ్యాయులు – కార్మికులు.. సకల ప్రజలు అంతా కలిసి చేసిన  ‘సకల జనుల సమ్మె’ చరిత్రలో నిలిచిపోయింది. 2011 మార్చి 10న జరిగిన మిలియన్ మార్చ్ కు లక్షలాది మంది తెలంగాణ ప్రజలు వచ్చి హైదరాబాద్ ను దిగ్బంధించారు. ఈ నిరసన దేశంలోనే చర్చనీయాంశమైంది. ప్రజా ఉద్యమానికి ఢిల్లీ కదిలి తెలంగాణను ప్రకటించింది. ఈ మహోజ్వల పోరాటానికి గుర్తుచేసుకొని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు ఇప్పుడు తెలంగాణలో మరో సకలజనుల సమ్మెకు ప్లాన్ చేశాయి.

నాడు తెలంగాణ సాధన కోసం ప్రజలు స్వచ్ఛందంగా అన్నీ మానుకొని ఆరువారాల పాటు ‘సకలజనుల సమ్మె’ చేశారు .సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు – ప్రభుత్వ ఉద్యోగులు – సింగరేణి కార్మికులు 27 రోజులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు అదే అస్త్రాన్ని తీస్తుండడం.. అందరూ ఏకతాటిపైకి వస్తుండడంతో మరో పోరు తెలంగాణ ఆవిష్కృతం కాబోతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.