దసరా పండుగకు టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు

దసరా పండుగ నేపథ్యంలో ప్ర‌యాణికులకు ఎలాంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా అద‌న‌పు బ‌స్సుల‌ను న‌డుపాల‌ని నిర్ణయించామని తెలంగాణ రోడ్డు ర‌వాణా సంస్థ అధికారులు తెలిపారు.

  • Balaraju Goud
  • Publish Date - 7:17 pm, Mon, 19 October 20

దసరా పండుగ నేపథ్యంలో ప్ర‌యాణికులకు ఎలాంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా అద‌న‌పు బ‌స్సుల‌ను న‌డుపాల‌ని నిర్ణయించామని తెలంగాణ రోడ్డు ర‌వాణా సంస్థ అధికారులు తెలిపారు. ఆ మేర‌కు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు మూడు వేల ప్రత్యేక బస్సులు నడపేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు రంగారెడ్డి ఆర్ఎం వరప్రసాద్ వెల్ల‌డించారు. హైద‌రాబాద్‌లోని మ‌హాత్మాగాంధీ బ‌స్‌స్టేష‌న్ తో పాటు జూబ్లీ బ‌స్‌స్టేష‌న్ , కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ రింగ్ రోడ్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆయ‌న తెలిపారు. ఈ బస్సుల్లో ప్ర‌యాణం కోసం ప్ర‌జ‌ల‌కు అడ్వాన్స్‌డ్ బుకింగ్ సౌకర్యం కూడా కల్పించినట్లు రంగారెడ్డి ఆర్ఎం చెప్పారు. ప్రజల భద్రతా సౌకర్యం కోసం టీఎస్ఆర్టీసీ బస్సులను మాత్రమే వినియోగించాలని ఆయన కోరారు.