టీఎస్‌ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు.. ఆ రోజే అధికారిక ప్రారంభం

తెలంగాణ ఆర్టీసీ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతుంది. కార్గో, పార్శిల్ సేవలను ఈ నెల జూన్ 19వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు టికెట్టేతర ఆదాయ వృద్ధికి పార్శిల్ వ్యవస్థను...

టీఎస్‌ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు.. ఆ రోజే అధికారిక ప్రారంభం
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2020 | 8:41 AM

తెలంగాణ ఆర్టీసీ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతుంది. కార్గో, పార్శిల్ సేవలను ఈ నెల జూన్ 19వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు టికెట్టేతర ఆదాయ వృద్ధికి పార్శిల్ వ్యవస్థను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అందుకు అనుగుణంగా అధికారులు కార్గో వ్యవస్థకు రూపకల్పన చేశారు. తొలి దశలో 80 బస్సులను సిద్ధం చేశారు.

ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు బాలామృతం, ఆహార పదార్థాలు తదితర రవాణా చేసేందుకు తెలంగాణ కార్గో బస్సులనే వినియోగించారు. మొదట ఈ సేవలను కార్గోతో సంబంధం లేకుండా ఏఎన్‌ఎల్, ఆ తరువాత శ్రీ సిద్ధార్థ ట్రేడర్స్‌తో ఒప్పందం చేసుకుని కొన్నేళ్లుగా పార్శిల్ సర్వీసు నిర్వహిస్తోంది. అయితే ఇక నుంచి సొంతంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. కాగా ఈ సేవలకు రవాణా మంత్రికి ఆఫీసర్ ఆన్ డ్యూటీగా విధులు నిర్వహిస్తోన్న కృష్ణకాంత్‌ను ప్రత్యేకాధికారిగా నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశల వారీగా పార్శిల్, కార్గో సేవలను రానున్న రోజుల్లో విస్తరిస్తామన్నారు. కొరియర్ బాయ్‌లను నియమించి బుకింగ్, హోం డెలివరీ సేవలను అందించాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు.

Read More: 

డిప్రెషన్‌కూ ‘ఇన్సూరెన్స్’.. సుప్రీం నోటీసులు

ఉద్యోగులకు భారీ ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..

ఖాతాదారులకు ఐసిఐసిఐ బ్యాంక్ బంపర్ ఆఫర్.. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం..