Breaking News
  • క్వారంటైన్‌ కేంద్రాలుగా స్టార్‌ హోటళ్లు. భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 12 హోటళ్లలో.. క్వారంటైన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసిన ఒడిశా ప్రభుత్వం. ముందుజాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారంటైన్‌ గదిలో ఉండాలనుకునేవారు.. డబ్బులు చెల్లించి ప్రైవేట్‌ హోటళ్లలో ఉండొచ్చన్న ప్రభుత్వం. రోజుకు రూ.2,500 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటన.
  • కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. మానవ కణాల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకునే.. కొత్త ఔషధాన్ని సిద్ధంచేసిన ఎంఐటీ శాస్త్రవేత్తలు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా నయం చేస్తుందని ప్రకటన.
  • ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ బి.పి.కనుంగో పదవీకాలం పొడిగింపు. రేపటితో ముగియనున్న బి.పి.కనుంగో పదవీకాలం. కనుంగో పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్బీఐ ప్రకటన.
  • కోత కాదు వాయిదా. ఏపీపై కరోనా తీవ్ర ప్రభావం. ప్రజాప్రతినిధుల జీతాలు వాయిదా. సీఎం నుంచి స్థానిక సంస్థల సభ్యుల వరకు.. 100 శాతం జీతాన్ని వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల జీతాల్లో 60 శాతం వాయిదా. నాలుగో తరగతి ఉద్యోగుల జీతంలో 10 శాతం వాయిదా. మిగతా ఉద్యోగుల జీతంలో 50 శాతం వాయిదా. వాయిదా వేసిన జీతాలు మళ్లీ చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం.
  • ఏపీలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌. ప.గో జిల్లాలో 14 పాజిటివ్‌ కేసులు నమోదు. నిన్నటి వరకు ఒక్క కేసూ లేని జిల్లాలో ఒకేసారి బయటపడ్డ 14 కేసులు. బాధితులంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్టు గుర్తింపు. ఏపీలో మొత్తం 58కి చేరిన కరోనా కేసులు.

TSPSC 2020: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ గురుకుల కాలేజీల్లో ఖాళీలు…

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలోని ఎస్‌టి గురుకుల డిగ్రీ కళాశాలల్లోని 15 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
TSPSC Recruitment 2020, TSPSC 2020: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ గురుకుల కాలేజీల్లో ఖాళీలు…

TSPSC Recruitment 2020: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలోని ఎస్‌టి గురుకుల డిగ్రీ కళాశాలల్లోని 15 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు అభ్యర్థులు మార్చి 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని టిఆర్‌ఇఐ-ఆర్‌బి ఛైర్మన్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గతంలో ఎస్‌సి గురుకుల డిగ్రీ మహిళా కళాశాలల్లో 19 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను జారీ చేసిన సంగతి విదితమే. ఇక ఆ పోస్టులతో పాటుగా వీటిని కూడా అదనంగా చేర్చారని.. దీనితో వెరిసి మొత్తంగా 34 గురుకుల డిగ్రీ ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Melania Trump To Visit Delhi Government Schools

ఇదిలా ఉంటే ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగుల కేటగిరీ అభ్యర్థులు పీజీలో 50 శాతం మార్కులు సాధించినవారు అర్హులు. ఇక అంతకముందు గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 24 నుంచి మార్చి 10 వరకు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా ఎలాంటి రుసుము చెల్లించకుండా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కాగా, దరఖాస్తు చేసుకున్నవారు సలహాలు, సంప్రదింపుల కొరకు అన్నీ రోజులూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040- 23317140 హెల్ప్‌లైన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అలాగే గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పోస్టుల నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

అర్హత వివరాలు…

వయో పరిమితి- 34 నుంచి 44 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు- రూ.2,000. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ.1,200

Related Tags