గవర్నర్ కు టీఎస్ పీఎస్సీ వార్షిక నివేదిక

ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ 2018-19 వార్షిక నివేదికను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు అందజేసింది. గవర్నర్‌తో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి నివేదికను సమర్పించారు.

గవర్నర్ కు టీఎస్ పీఎస్సీ వార్షిక నివేదిక
Follow us

| Edited By:

Updated on: Sep 24, 2020 | 12:58 PM

ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ 2018-19 వార్షిక నివేదికను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు అందజేసింది. గవర్నర్‌తో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి నివేదికను సమర్పించారు. 2015 జూలై నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు కేవలం టీఎస్‌పీఎస్సీ ద్వారా 39,952 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపినట్టు నివేదికలో పేర్కొన్నారు.

టిఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటి వరకు 36,665 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసినట్లు తెలిపారు. వాటిలో 29,128 ఉద్యోగాలను భర్తీ చేయగా, 1621 పోస్టుల భర్తీ చివరి దశల్లో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. మార్కుల వెయిటేజీ, కోర్టు కేసులు తదితర కారణాల వల్ల 5,916 పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలిపారు. ఇందులో 290 పారామెడికల్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి 30శాతం వెయిటేజీ మార్కుల జాబితా అందలేదని పేర్కొన్నారు. కోర్టు కేసుల వల్ల 4,207 పారామెడికల్‌ పోస్టులు, 1,419 టీఆర్టీ, గురుకుల పీఈటీ పోస్టుల భర్తీ నిలిచిపోయినట్లు తెలిపారు.

2018-19లో 18 నోటిఫికేషన్ల ద్వారా 3,276 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని అన్నారు. అయితే ఇందులో 45 పరీక్షలను నిర్వహించామని వెల్లడించారు. ఈ పరీక్షలకు 19,91,770 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 12,97,566 మంది హాజరైనట్లు తెలిపారు. వీరిలో 15,994 మంది ఎంపికైనట్లు నివేదికలో పేర్కొన్నారు. గతేడాది 107 కేసులకుగానూ 100 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.

టీఎస్‌పీఎస్సీ పనితనాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రశంసించారు. టీఎస్పీఎస్సీలో నూతన సంస్కరణల అమలు, విజయవంతంగా పలు పోస్టులు భర్తీ చేయడంపై చైర్మన్‌ను, సభ్యులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ పీఎస్సీ సభ్యులు సీ విఠల్‌, బీ చంద్రావతి, మహ్మద్‌ మథీనుద్దీన్‌ ఖాద్రీ, డీ కృష్ణారెడ్డి, సీహెచ్‌ సాయిలు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీప్రసాద్‌ పాల్గొన్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..