Breaking News
  • అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. నగరాల ప్రజలు బయటకు వెళ్లకుండా కట్టడి చేయాలి. వలస కూలీలకు వసతులు, సకాలంలో వేతనాలు చెల్లించేలా చూడాలి. విద్యార్థులు, కార్మికులను ఖాళీ చేయాలని కోరినవారిపై చర్యలు-కేంద్రం.
  • దేశవ్యాప్తంగా ఆల్కహాల్‌ విత్‌డ్రాల్‌ సిండ్రోమ్‌ . కేరళలో మద్యానికి బానిసై ఆరుగురు ఆత్మహత్య. ఆల్కహాల్‌ లేదన్న బాధతో షేవింగ్‌ లోషన్‌ తాగిన ఓ వ్యక్తి. తెలంగాణలో మద్యం దొరకడంలేదని ప్రాణం తీసుకున్న ఓ వ్యక్తి. తెలంగాణలో కల్లు దొరకక ఓ వ్యక్తి వింత ప్రవర్తన. ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకోవడంతో మృతి.v
  • తూ.గో: ఉ.6 నుంచి 10 వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి. జిల్లాలో ఐదు ఐసోలేషన్‌ పడకలు సిద్ధం-మంత్రి పిల్లి సుభాష్‌. 15 వేల మంది ఉండేలా క్వారంటైన్‌ కేంద్రాలు. అక్వా రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం-మంత్రి పిల్లి సుభాష్‌.
  • ప్రధాని మోదీకి రాహుల్‌ లేఖ. మన దేశం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ చర్యలకు సహకరించడానికి సిద్ధం-రాహుల్‌. లక్షల సంఖ్యలో రోజువారీ కూలీలు ఉన్నారు. లాక్‌డౌన్‌తో చాలామంది ప్రజలు చనిపోయే పరిస్థితి. లక్షలాది మంది యువత సొంత గ్రామాలకు వెళ్తున్నారు. వారిలో కరోనా ఉంటే తల్లిదండ్రులు, వృద్ధులకు సోకే అవకాశం. కొత్త ఆస్పత్రుల నిర్మాణం వెంటనే చేపట్టాలి-రాహుల్‌.
  • స్పైస్‌ జెట్‌ పైలట్‌కు కరోనా పాజిటివ్‌. మార్చి 21న చెన్నై నుంచి ఢిల్లీకి విమానాన్ని నడిపిన పైలట్‌. స్వీయ నిర్బంధంలోనే పైలట్‌.

ప్రైవేటు ప్రసక్తేలేదు..విపక్షాలది తప్పుడు ప్రచారమన్న పువ్వాడ

puvvada says no privitisation of rtc, ప్రైవేటు ప్రసక్తేలేదు..విపక్షాలది తప్పుడు ప్రచారమన్న పువ్వాడ

టిఎస్ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారన్న విపక్షాల ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. సమర్థవంతమైన చర్యలతో ఆర్టీసీని కాపాడుకుంటాం కానీ ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంతో విపక్షాలు కార్మికులను ఆందోళనకు గురిచేస్తూ వారిని తప్పు దారి పట్టిస్తున్నాయని అజయ్ ప్రతిపక్ష నాయకులపై మండిపడ్డారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్‌ఎస్‌ ఎప్పుడు చెప్పలేదన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాయా అని ప్రశ్నించారు? రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న బీజేపీ నేతలు, కేంద్రం చేస్తున్న పనులను గమనించటంలేదన్నారు.

రైల్వేలో ప్రైవేటీకరణ విధానం బీజేపీ రాష్ట్ర నేతలకు కనిపించటం లేదా అన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాయన్నారు. సమ్మెతో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలను విపక్షాలు సమర్థిస్తున్నాయా అని ప్రశ్నించారు. సమ్మెను ప్రయాణీకుల మీద, ప్రభుత్వం మీద బలవంతంగా రుద్దారన్నారు. ప్రయాణికుల సౌకర్యం నిమిత్తం ప్రభుత్వం 7358 వాహనాలను నడుపుతోందన్నారు. బస్సులను నడిపించేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమిస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4416 కోట్లు. విధానపరంగా ఆర్టీసీ ఉండాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. మూడేళ్ల కిందట 25 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తారని అనుకున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఇచ్చిందన్నారు. టిమ్‌ మిషన్‌లు పనిచేయకుండా నేతలు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు.

Related Tags