TS RTC: పెరగనున్న తెలంగాణ ఆర్టీసీ చార్జీలు… ముఖ్యమంత్రికి అధికారుల నివేదిక..! ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయంటే..

TS RTC Fare Hike: తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ గురువారం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రితో పలు అంశాలపై చర్చించారు...

TS RTC: పెరగనున్న తెలంగాణ ఆర్టీసీ చార్జీలు... ముఖ్యమంత్రికి అధికారుల నివేదిక..! ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయంటే..
Follow us

|

Updated on: Jan 22, 2021 | 7:18 AM

TS RTC Fare Hike: తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ గురువారం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రితో పలు అంశాలపై చర్చించారు. లాక్‌డౌన్‌, డీజీల్‌ ధరల పెంపు, గతంలో పేరుకుపోయిన బకాయిలు తదితర కారణాలతో చార్జీల పెంపునకు అధికారులు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు చేశారు. ఈ క్రమంలో అధికారులు సీఎంతో మాట్లాడుతూ.. ‘స్వల్ప వ్యవధిలోనే డీజీల్‌ ధర లీటర్‌కు 15 రూపాయలు పెరిగింది. ఇది ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపింది. పరిస్థితి ఇలాగే ఉంటే పెనుభారంగా మారనుంది. అదే సమయంలో ఉద్యోగుల జీతాలు పెంచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీపై పెనుభారం తప్పదు. అది భరించే స్థితిలో ఆర్టీసీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఆర్టీసీకి సహాయం అందించాలి. బస్సు చార్జీలు పెంచాలి. ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితి ఉండదు’ అని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునిల్‌ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మరి ఆర్టీసీ చార్జీలు ఏ మేర పెరుగుతాయి, ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారనే విషయాలు తెలియాల్సి ఉంది.

Also Read: Passport based ‘Dharani’ : పాస్‌పోర్టు ఆధారంగా ‘ధరణి’ పాస్‌బుక్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం