సీఎం కెసిఆర్ గొప్ప లౌకికవాది.. కొత్త సచివాలయంలో ఆ నిర్మాణాలు ప్రభుత్వమే నిర్మిస్తుందన్న మంత్రులు

ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ,తలసాని శ్రీనివాస్ యాదవ్ లు..

సీఎం కెసిఆర్ గొప్ప లౌకికవాది.. కొత్త సచివాలయంలో ఆ నిర్మాణాలు ప్రభుత్వమే నిర్మిస్తుందన్న మంత్రులు
Follow us

|

Updated on: Jan 27, 2021 | 6:41 PM

ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ,తలసాని శ్రీనివాస్ యాదవ్ లు చెప్పారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను నిర్మించే విషయమై మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన సెక్రటేరియట్ లో బుధవారం సమావేశం జరిగింది.

హోం మంత్రి, పశుసంవర్ధక శాఖల మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి కొప్పుల ముస్లిం మత ప్రతినిధులు, క్రిస్టియన్, హిందూ మతాలకు సెక్రటేరియట్ ఉద్యోగులతో చర్చించారు. కొత్తగా నిర్మిస్తునన సచివాలయంలో గుడి, మసీదు, చర్చిల నిర్మాణ ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రులు తెలిపారు. సచివాలయంతో పాటు ప్రార్థనా మందిరాలు కూడా సకాలంలో పూర్తవుతాయని మంత్రులు స్పష్టం చేశారు.ఇందులో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు హామీనిచ్చారు.

కెసిఆర్ నిబద్ధత, అంకితభావం పట్ల తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ప్రార్థనా మందిరాలను సకాలంలో నిర్మిస్తారన్న నమ్మకంతో ఉన్నామని మూడు మతాల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.