రాజ్‌నాథ్‌తో కెటీఆర్ భేటీ.. ఎందుకో తెల్సా ?

రాష్ట్ర మంత్రులు ఢిల్లీ పర్యటనలకు వెళ్ళడం.. కేంద్రంలోని ప్రధాన శాఖల మంత్రులను, అధికారులను కల్వడం అతి సాధారణ విషయం. కానీ మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్ళిన తెలంగాణ మంత్రి కెటీఆర్ పర్యటన వెనుక అసలు ఉద్దేశం మాత్రం వేరే అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆయన ఢిల్లీ పర్యటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితేనేం.. ఆయన ఢిల్లీకి వెళ్ళి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసిన విషయం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దానికి […]

రాజ్‌నాథ్‌తో కెటీఆర్ భేటీ.. ఎందుకో తెల్సా ?
Follow us

|

Updated on: Oct 30, 2019 | 4:47 PM

రాష్ట్ర మంత్రులు ఢిల్లీ పర్యటనలకు వెళ్ళడం.. కేంద్రంలోని ప్రధాన శాఖల మంత్రులను, అధికారులను కల్వడం అతి సాధారణ విషయం. కానీ మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్ళిన తెలంగాణ మంత్రి కెటీఆర్ పర్యటన వెనుక అసలు ఉద్దేశం మాత్రం వేరే అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆయన ఢిల్లీ పర్యటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితేనేం.. ఆయన ఢిల్లీకి వెళ్ళి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసిన విషయం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దానికి ఫోటోలను కూడా జత చేశారు. ఇంతటితో కథ అయిపోయిందనుకుంటే పప్పులో కాలేసినట్లే.
కెటీఆర్ రాజ్‌నాథ్ సింగ్‌ని కల్వడం వెనుక ఉద్దేశం వేరే వుందంటూ గులాబీ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్డీయే ప్రభుత్వంలో మోదీ తర్వాత ఎవరు అంటే కొందరు అమిత్ షా పేరును.. మరికొందరు రాజ్‌నాథ్ సింగ్ పేరును చెబుతుంటారు. అంటే ఒక విధంగా రాజ్‌నాథ్ సింగ్ ఎన్డీయే ప్రభుత్వంలో నెంబర్ 2 అన్నమాట. అలాంటి నెంబర్ టూ నేతను కెటీఆర్ కల్వడం వెనుక ఉద్దేశం ఏమై వుంటుందా అని చూస్తే కీలకాంశాలు వెలుగులోకి వస్తు్న్నాయి.
సౌత్‌బ్లాక్‌లో రాజ్‌నాథ్‌ను కలిసిన కెటీఆర్ తెలంగాణలోని రెండు ప్రధాన రహదారులపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గతంలో నిర్మలా సీతారామన్ రక్షణ శాఖా మంత్రిగా వున్నపుడు పలు మార్లు కోరినప్పటికీ రక్షణ శాఖ భూముల కేటాయింపు అంశాలన్ని పెద్దగా ఖాతరు చేయలేదు. ఇప్పుడు హైదరాబాద్‌- నాగ్‌పూర్‌, హైదరాబాద్‌ – రామగుండం జాతీయ రహదారులపై రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో వాటిని విస్తరించడానికి సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాలలో వున్న రక్షణ శాఖ భూములను కేటాయించాలని బుధవారం రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసి కెటీఆర్ కోరారు.
ప్రస్తుతం ఉన్న రహదారులు పెరుగుతున్న వాహనాల రద్దీకి సరిపోవడం లేదని, ఆయా మార్గాల్లో స్కైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున భూముల అప్పగింతపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాజ్‌నాథ్‌ను కేటీఆర్‌ కోరారు. గతంలో ఎన్నిమార్లు విఙ్ఞప్తి చేసినా అప్పటి రక్షణ శాఖ మంత్రి పెద్దగా స్పందించలేదన్న అంశాన్ని కూడా కెటీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చినట్లు సమాచారం.