ముత్యాల నగరానికి మరో ఆభరణం : కేటీఆర్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ముత్యాల నగరానికి మరో ఆభరణంగా అభివర్ణించారు మంత్రి కేటీఆర్. రాత్రివేళ విద్యుద్దీప కాంతుల్లో వంతెన సోయగాల ఫొటోలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఆయన.. ఈ అద్భుతమైన బ్రిడ్జిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి నగరప్రజానీకానికి అంకితం చేయడానికి సంతోషిస్తున్నాన్నారు. ప్రపంచంలోనే అతి పొడవైన స్పాన్ కాంక్రీట్ డెక్ ఎక్స్‌ట్రాడోజ్డ్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జిగా దీన్ని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగర ట్రాఫిక్ కష్టాలు తీర్చే ప్రణాళికలో భాగంగా దుర్గం చెరువు […]

ముత్యాల నగరానికి మరో ఆభరణం : కేటీఆర్
Follow us

|

Updated on: Sep 25, 2020 | 2:58 PM

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ముత్యాల నగరానికి మరో ఆభరణంగా అభివర్ణించారు మంత్రి కేటీఆర్. రాత్రివేళ విద్యుద్దీప కాంతుల్లో వంతెన సోయగాల ఫొటోలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఆయన.. ఈ అద్భుతమైన బ్రిడ్జిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి నగరప్రజానీకానికి అంకితం చేయడానికి సంతోషిస్తున్నాన్నారు. ప్రపంచంలోనే అతి పొడవైన స్పాన్ కాంక్రీట్ డెక్ ఎక్స్‌ట్రాడోజ్డ్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జిగా దీన్ని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగర ట్రాఫిక్ కష్టాలు తీర్చే ప్రణాళికలో భాగంగా దుర్గం చెరువు దగ్గర భారీ కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు.

ఎప్పటి నుంచో వాయిదాలు పడుతూ వస్తున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభించతలపెట్టారు. రూ.184 కోట్ల వ్యయంతో ఈ తీగల వంతెనను నిర్మించారు. గచ్చిబౌలి, మాదాపూర్‌లో పని చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడనుంది. అంతేకాక, దుర్గం చెరువు ప్రాంతం పర్యటకంగానూ మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది.