Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైద్య పరీక్షల కోసం గుంటూరు మెడికల్‌ కాలేజీలో కరోనా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు అధికారులు.
  • మందు తాగితే తూలడం, మందు లేకపోతే మతిస్థిమితం కోల్పోయినట్టుగా ప్రవర్తించడం.. ఇదే ఇప్పుడు అంతటా కనిపిస్తోంది.. కరోనా కాలంలో మందుబాబుల కష్టాలు అన్నీఇన్నీ కావు.. మద్యం దుకాణాలన్నీ బంద్‌.. బార్లు పబ్బులు బంద్‌.. తాగి తాగి పిచ్చెక్కిపోయిన మందుబాబులు చివరకు దొంగలుగా మారిపోయారు.
  • తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వెల్లూరు, తేంగాశి, కల్లకురిచి జిల్లాలలో పెరుగుతోన్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో 411 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 64 మంది నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం.
  • కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళితే మాస్క్‌ తప్పనిసరిగా వాడాలని కేంద్రం తెలిపింది. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందనని రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసు శాఖలను ఆదేశించింది.
  • లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. అనవసరంగా రోడ్డు మీదకొస్తే వాహనాలు సీజ్‌ చేస్తామన్నారు.

బిగ్ బ్రేకింగ్: స్కూళ్లకు సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకో తెలుసా?

Ts government extends school holidays due to TSRTC strike, బిగ్ బ్రేకింగ్:  స్కూళ్లకు సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకో తెలుసా?

ఆర్టీసీ సమ్మె కారణంగా స్కూళ్లకు సెలవులను పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. సోమవారం నుంచి స్కూల్స్ తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఆర్టీసీ యూనియన్లు సమ్మె చేపట్టిన నేపథ్యంలో స్కూల్ విద్యార్ధులు స్కూల్స్ వెళ్ళడం కష్టంగా మారే పరిస్థితులు ఉన్నందున ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయించింది. ఈనెల 19 వరకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్కూల్స్ తెరిచే నాటికి బస్సుల సంఖ్య కూడా పెంచాలని అధికారులను ఆదేశించింది.

సమ్మెపై  కార్యాచరణ 

ఇదిలా ఉంటే ఆర్టీసీ సమ్మెపై అఖిలపక్షం తదుపరి కార్యాచరణ ప్రకటించింది. ఇప్పటికే పలు రాజకీయ పక్షాలు సమ్మెకు బహిరంగ మద్దతు ప్రకటించి.. కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో సైతం పాల్గొన్ని వారికి సంఘీభావంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆదివారం నుంచి చేపట్టాల్సిన విధివిధానాలపై చర్చించారు. ఇక సమ్మెను ఉధృతం చేయలని అన్ని పక్షాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా 13 వతేదీ వంటావార్పు, 14న బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న విద్యార్ధులతో కలిసి ర్యాలీలు, 17న ధూంధాం కార్యక్రమాలు,, 18న బైక్ ర్యాలీలు, 19న తెలంగాణ బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే బంద్‌పై పూర్తి క్లారిటీ మాత్రం రాలేదు. తమ డిమాండ్ల సాధనకోసం ఎంతటి పోరాటమైనా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీఎస్ఆర్టీసీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే తమకు మద్దతు నిచ్చిన వారికి ధన్యవాదలు చెబుతూనే.. మరికొన్ని కార్మిక సంఘాలు కూడా తమ పరిస్థితిని అర్ధం చేసుకుని మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

 

Related Tags