‘ఇంజినీరింగ్‌’ సెల్ఫ్‌ రిపో‌ర్టింగ్‌ కు ఇవాళ ఆఖరు తేదీ

తెలంగాణలో ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు ఘట్టం నేటితో ముగియనుంది. తొలి విడుత ఎంసెట్‌ కౌన్సె‌లిం‌గ్‌లో సీట్లు పొందిన విద్యా‌ర్థులు కాలే‌జీల్లో సెల్ఫ్‌ రిపో‌ర్టింగ్‌ చేయ‌డా‌నికి నేటితో గ‌డువు ముగియ‌నుంది.

‘ఇంజినీరింగ్‌’ సెల్ఫ్‌ రిపో‌ర్టింగ్‌ కు ఇవాళ ఆఖరు తేదీ
Follow us

|

Updated on: Oct 29, 2020 | 8:11 AM

తెలంగాణలో ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు ఘట్టం నేటితో ముగియనుంది. తొలి విడుత ఎంసెట్‌ కౌన్సె‌లిం‌గ్‌లో సీట్లు పొందిన విద్యా‌ర్థులు కాలే‌జీల్లో సెల్ఫ్‌ రిపో‌ర్టింగ్‌ చేయ‌డా‌నికి నేటితో గ‌డువు ముగియ‌నుంది. షెడ్యూల్‌ ప్రకారం బు‌ధ‌వా‌రంతో సెల్ఫ్‌ రిపో‌ర్టింగ్‌ గడువు ముగి‌సినప్ప‌టికీ, దాన్ని ఒక‌రోజు పొడి‌గిస్తూ ఎంసెట్‌ అడ్మి‌షన్‌ కమిటీ నిర్ణయం తీసు‌కుంది. తొలి విడు‌తతో 50,288 మంది విద్యా‌ర్థు‌లకు సీట్లు రాగా.. బుధ‌వారం నాటికి 36వేల మందికి రిపోర్టు చేశారు. మ‌రో 14 వేల మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయ‌క‌పోవ‌డంతో అధికారులు గ‌డువు పొడిగించారు. ఇవాళ చివరి రోజు కావడంతో మరి కొంత మంది విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, రాష్ట్రంలో తొలి విడుత 71.49 శాతం ఇంజినీరింగ్‌ సీట్లు భర్తీ అయ్యాయని.. ఇంకా 19,998 సీట్లు మిగిలాయని తెలిపారు. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీ కాలేజీల్లో 3,091 ( 98.5 శాతం) సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే, 164 ప్రైవేట్‌ కళాశాలల్లో 47,046 బీటెక్‌ సీట్లు కేటాయించారు. 13 యూనివర్సిటీలు, 35 ప్రైవేట్‌ కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. మూడు ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. బీటెక్‌లోని 21 కోర్సుల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. బీఫార్మసీ, ఎంపీసీ కోటాలో కేవలం 4.02 శాతం సీట్లు మాత్రమే భర్తీ కాగా 4,324 సీట్లు మిగిలాయి.