రేవంత్‌కు.. రవ్వంత కూడా ఆ..ఆలోచన లేదా?

ఏదో చేస్తాడనుకుంటే.. ఏదోదో చేస్తున్నాడట.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఆయన మాటలకు.. చేతలకు అసలు పొంతనే లేదని... అసలు కంటే కొసరు పనులపైనే ఫోకస్ పెట్టారంటూ రేవంత్‌పై సొంత కేడరే చెవులు..

రేవంత్‌కు.. రవ్వంత కూడా ఆ..ఆలోచన లేదా?
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2020 | 8:50 AM

ఏదో చేస్తాడనుకుంటే.. ఏదోదో చేస్తున్నాడట.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఆయన మాటలకు.. చేతలకు అసలు పొంతనే లేదని… అసలు కంటే కొసరు పనులపైనే ఫోకస్ పెట్టారంటూ రేవంత్‌పై సొంత కేడరే చెవులు కొరుక్కుంటోదట. ఈయనకు తెలంగాణ రాజకీయాల కంటే ఏపీ రాజకీయాలపైనే మక్కువ ఎక్కువని… అసలే సొంతూరులో సొంత కేడర్‌ను కూడా గెలిపించుకోలేని పరిస్థితుల్లో ఉంటే.. పక్కోళ్ల ముచ్చట్లు మనకేలా అంటూ తెగ.. ఇదైపోతున్నారట రేవంత్ అనుచరవర్గం.

రేవంత్ రెడ్డి.. తెలంగాణాలో డైనమిక్ లీడర్. అందులో డౌట్ లేదు. ఆయన రాజకీయమే దూకుడుగా ఉంటుంది. టీడీపీలో ఇలా ప్రవేశించి అలా అల్లుకుపోయారు. ఎంతలా అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నేతల్నే కాదనుకునేంత. ఆయన డైనమిజాన్ని చూసే సోనియా గాంధీ పార్టీలో చేరిన కొన్నాళ్లకే కీలక పదవులు కట్టబెట్టింది. తెలంగాణ కాంగ్రెస్‌ను ఆయన భుజాలపై పెట్టింది. కానీ అనుకున్నంత రేంజ్‌లో రేవంత్ రాజకీయం సాగడం లేదు. నిన్నటికి నిన్న జరిగిన ఎన్నికల్లోనూ బొక్కా బోర్లాపడి బొమ్మ కనిపించింది సారువారికి. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్‌లో ఆయన ప్రభావం.. మరింత కరిగిపోతోంది. అక్కడ కారు జోరు ముందు రేవంత్ మరింత బేజారవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 12 వార్డుల్లో గులాబీ పార్టీ 7 గెలుపొందగా, కాంగ్రెస్‌ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేస్తూ.. కొడంగల్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులే షాక్ అయ్యాయి.

ఎంత లేదన్నా తెలంగాణలో జగన్‌కు అభిమానులున్నారు. కేసీఆర్‌తో జగన్‌ ఎన్నికల ముందు నుంచే దోస్తీ కంటిన్యూ అవుతోంది. దీంతో ఫ్యాన్ పార్టీ వాళ్లంతా కారు గుర్తు వైపే కదిలారు. కేసీఆర్‌కే జై కొట్టారు. కానీ చంద్రబాబుకు బంటుగా ఉన్నాడన్న ప్రచారంతో.. తెలంగాణలో రేవంత్‌ ఇమేజ్‌.. రవ్వంత రవ్వంతగా కరిగిపోతోంది. ఇది కేడర్ గమనించింది కానీ.. ఇంకా రేవంత్ పట్టించుకున్నట్లు లేదు. అడపదడపా… ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతూ.. ఇక్కడ మైనస్‌గా మారుతున్నాడంటూ సొంత వాళ్లే అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా రేవంత్ చంద్రబాబు మాయ నుంచి బయటపడకుంటే… అసలుకే మోసం వస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ పగ్గాలు చేపట్టేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్న రేవంత్‌… ఇలాంటి కామెంట్స్‌తో వెనకబడిపోతారని… రేవంత్‌ రవ్వంతైనా మారాలంటూ సొంత కేడరే భావిస్తోందట.

తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే