Breaking News
  • అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ పై సీఎం జగన్ సమీక్ష . 2014 అంచనాల ప్రకారం 20398.61 మాత్రమే ఇరిగేషన్ కంపోనెంట్ కు చెల్లిస్తాం అని పేర్కొన్న కేంద్ర ఆర్థిక శాఖ. దీనిపై అంగీకారం తెలపాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పిపిఏ) ను కోరిన కేంద్ర ఆర్థిక శాఖ . 55448.87 కోట్ల రూపాయల వ్యయం కు ఆమోదం తెలిపిన పిపిఏ, సీడబ్లూసి. అందులో 47725.74 కోట్ల రూపాయలకు రివైస్డ్ కాస్ట్ కమిటీ, కేంద్ర జెల్ శక్తి ఆమోదం. అది ఆమోదించాలని ఆర్థిక శాఖను జల శక్తి శాఖ కోరిందని సీఎంకు వివరించిన అధికారులు .
  • పండుగ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉల్లి ను సబ్సిడీలో అందిస్తున్న ప్రభుత్వం. రైతుబజార్లలో కిలో ఉల్లి ముప్పై ఐదు రూపాయలకు సబ్సిడీలో అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. మనిషికి రెండు కేజీల చొప్పున ఆధార్ కార్డ్ చూపిస్తే సబ్సిడీ ఉల్లి. ఉల్లి ధర అందుబాటులోకి వచ్చే వరకు ఈ సబ్సిడీ ఉల్లి కేంద్రాలను అందుబాటులో ఉంచనున్నారు. ఎస్టేట్ అధికారి రమేష్.
  • విశాఖ: ఓల్డ్ IT జ౦క్షన్ వద్ద పోలీసులమని చెప్పి రోడ్డుపై వెలుతున్న వృద్ధుడిని బురిడి కొట్టిన ఇద్దరు దు౦డగులు. ఒ౦టిపై బ౦గారు నగలు ఉంటే దొంగతనంకి గురికావచ్చని చెప్పి దృష్టి మరల్చి గోల్డ్ చైన్,రి౦గును కాజేసిన దు౦డగులు. పోలీసు ID కార్డు చుాపి౦చి దోచుకున్న దు౦డగులు. బైక్ పై పరారు.
  • విశాఖ: ఇకపై విశాఖ కేంద్రంగా కొనసాగనున్న AP మెట్రో రైల్ కార్పొరేషన్ కార్యకలాపాలు విశాఖలో నేడు ప్రారంభం కానున్న AP మెట్రో రైలు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నగరంలోని LIC బిల్డింగ్ లోని 3వ అ౦తస్తులో కార్యాలయం మద్యహ్న౦ 12 గ౦టలకు మెట్రో కార్యాలయాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మ౦త్రి బొత్స
  • ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రి పై చివరి రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. నేడు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్రులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఉత్సవాలకు చివరి రోజు కావడంతో రాజరాజేశ్వరి దేవి దర్శనార్ధం తరలి వస్తున్న భక్తులు . సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవం . ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహంతో దుర్గమ్మ నదీ విహారం రద్దు . హంస వాహనంపైనే అమ్మవారి ఉత్సవ మూర్తులకు పూజాది కార్యక్రమాలను నిర్వహించనున్న అర్చకులు . పరిమిత‌సంఖ్యలోనే‌ విఐపి లకు అనుమతి. ఘాట్లలో భక్తులకు అనుమతి నిరాకరణ...ప్రకాశం బ్యారేజి నుంచి మాత్రమే వీక్షించేందుకు అనుమతి.
  • మైహోమ్ బూజాలో ఐసిఐసిఐ బ్యాంక్ ను ప్రారంభించిన మైహోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు. మైహోమ్ బూజాలో విజేత ఈలైట్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన జూపల్లి రామేశ్వర్ రావు. కుటుంబ సభ్యులతో కలిసి విజేత ఈలైట్ లో షాపింగ్ చేసిన రామేశ్వరరావు.
  • బంజారాహిల్స్ డిడెక్టీవ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్: లోటస్ పాండ్ లో డెడ్ బాడీ ఉన్నట్లు సమాచారం వచ్చింది. మార్నిగ్ వాక్ కోసం వచ్చి ప్రమాదవశాతు పడి మృతి చెందినట్టు ప్రాథమికంగా గుర్తించాం. మృతుడు బంజరహిల్స్ IAS కాలానికి చెందిన అహ్మద్. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియకు తరలించాం. అహ్మద్ షుగర్ వ్యాది తో భాధపడ్తున్నట్టు సోదరుడు చెప్పాడు. మార్నిగ్ వాక్ చేస్తూ కళ్ళు తిరిగి నీళ్లల్లో పడినట్లు భావిస్తున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము.

ముందస్తు జాగ్రత్తలపై సీఎం కేసీఆర్ స‌మీక్ష

TS CM KCR review meeting with CS somesh kumar on heavy rains and floods, ముందస్తు జాగ్రత్తలపై సీఎం కేసీఆర్ స‌మీక్ష

తెలంగాణలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేశ్ కుమార్‌తో చర్చించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న తరుణంలో అధికారుల‌ను అప్రమ‌త్తం చేయాల‌ని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అవ‌స‌ర‌మైన ముందు జాగ్రత్త చ‌ర్యలు చేప‌ట్టాల‌ని సూచించారు. ఈ క్రమంలో ఆయా జిల్లాల క‌లెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారుల‌ను సీఎస్ అప్రమ‌త్తం చేశారు. ఈ రెండు, మూడు రోజులు హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాల‌ని సీఎస్ అధికారుల‌ను ఆదేశించారు. కాగా, కుండ‌పోత వ‌ర్షాల‌కు తెలంగాణ త‌డిసి ముద్దవుతోంది. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌కు రాష్ర్టంలోని ప్రాజెక్టులు నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. వాగులు, వంక‌లు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.

Related Tags