కొత్తింటి కల మరింత సులువు…త్వరలోనే అమల్లోకి టీఎస్‌బీపాస్‌

సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించనుంది. కొత్తింటి నిర్మాణానికి అనుమతుల కోసం ప్రత్నిస్తున్నవారికి ఇది నిజంగానే శుభవార్త అని చెప్పాలి. మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన టీఎస్‌బీపాస్‌ విధానాన్ని మరింత సులభతరంగా మార్చేశారు. తాజాగా టీఎస్‌బీఎస్ అమలుకు మూహూర్తం ఖరారు చేశారు.

కొత్తింటి కల మరింత సులువు...త్వరలోనే అమల్లోకి టీఎస్‌బీపాస్‌
Follow us

|

Updated on: Mar 02, 2020 | 7:56 AM

సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించనుంది. కొత్తింటి నిర్మాణానికి అనుమతుల కోసం ప్రత్నిస్తున్నవారికి ఇది నిజంగానే శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే..గతంలో ఇంటి పర్మిషన్ కోసం కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగి అలిసిపోయిన వారందరికి ప్రభుత్వం గతంలో వెసులు బాటు కల్పించింది. అయితే, అందులో తలెత్తిన అనేక సమస్యలు, సాంకేతిక లోపాల కారణంగా ప్రజలు కాస్తా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అటువంటి సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన టీఎస్‌బీపాస్‌ విధానాన్ని మరింత సులభతరంగా మార్చేశారు. తాజాగా టీఎస్‌బీఎస్ అమలుకు మూహూర్తం ఖరారు చేశారు. వివరాల్లోకి వెళితే…

భవన నిర్మాణ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో భవన నిర్మాణ అనుమతుల నిబంధనలను సవరించింది తెలంగాణ ప్రభుత్వం. సంవత్సరం క్రితం అమల్లోకి వచ్చిన ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతుల విధానం నిర్మాణదారులకు అనేక సమస్యలను సృష్టించింది. దీంతో 21 రోజుల్లోనే నిర్మాణ అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది టీఆఎస్ సర్కార్. ఈ మేరకు భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 21 రోజుల్లో అన్ని అనుమతులు జారీ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను మంత్రి కల్వకుంట్ల ఆదేశించారు. విధించిన గడువు దాటిన పక్షంలో రోజుకు రూ.1000 చొప్పున సంబంధిత అధికారిని నుంచి జరిమాన వసూలు చేయనున్నట్టు మంత్రి హెచ్చరించారు. పారిశ్రామిక విధానంలో పరిశ్రమలకు అనుమతుల జారీలో జాప్యం చేస్తే జరిమానా విధించే విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. . ఇదే విధానాన్ని భవన నిర్మాణాల అనుమతులకు కూడా వర్తింప చేయబోతున్నట్టు మంత్రి కెటిఆర్ వివరించారు. ఆదివారం ఖమ్మం, ఇల్లెందు పట్టణప్రగతి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాలు సర్వాంగసుందరంగా, పరిశుభ్రంగా తయారుకావాలంటే ఒక్కో కార్పొరేటర్‌ ఒక్కో కేసీఆర్‌ కావాలని పిలుపునిచ్చారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..