బండి సంజయ్ అరెస్ట్.. గ్రాండ్ సక్సెస్ అని ప్రకటన

తెలంగాణ భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన 'ఛలో అసెంబ్లీ' కార్యక్రమం విజయవంతమైందని ఆపార్టీ అధ్యక్షుడు బండి సంజ‌య్ అన్నారు. 'ఛలో అసెంబ్లీ' కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులు..

బండి సంజయ్ అరెస్ట్.. గ్రాండ్ సక్సెస్ అని ప్రకటన
Follow us

|

Updated on: Sep 11, 2020 | 2:54 PM

తెలంగాణ భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం విజయవంతమైందని ఆపార్టీ అధ్యక్షుడు బండి సంజ‌య్ అన్నారు. ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులు.. నిర్బంధాలు విధించినా కార్యకర్తలు ఛేదించుకొని అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారని ఆయ‌న తెలిపారు. అనేక మంది బీజేపీ నాయకులను గృహ నిర్బంధం చేశారని.. గ్రామీణ ప్రాంతం నుండి అసెంబ్లీకి రాకుండా ఎక్కడికక్కడ అరెస్టు చేశారని సంజయ్ ఆరోపించారు. ఇలాఉంటే, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండ‌గా బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో హైదరాబాద్ లో స్వల్ప ఉద్రిక్త వాతావ‌ర‌ణ నెల‌కొంది. సంజ‌య్ ను త‌ర‌లిస్తోన్న వాహ‌నాన్ని ముందుకు వెళ్లనివ్వకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డంగా ప‌డుకున్నారు. చివ‌ర‌కు సంజ‌య్ ను అరెస్ట్ చేసిన పోలీసులు గోషామ‌హ‌ల్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.