జో బైడెన్ స్ఫూర్తి, బీహారీలకు చిదంబరం పిలుపు

బీహార్ ఎన్నికల నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ఓటర్లకు విశిష్టమైన పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.

జో బైడెన్ స్ఫూర్తి, బీహారీలకు చిదంబరం పిలుపు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 18, 2020 | 5:06 PM

బీహార్ ఎన్నికల నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ఓటర్లకు విశిష్టమైన పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ‘భయం కన్నా ఆశాకిరణమే  మన ఆయుధం, విభజన కన్నా సమైక్యమే సముచితం, అసత్యాలకన్నా సత్యానిదే విజయం’ అంటూ బైడెన్ తమ అమెరికన్ ఓటర్లనుద్దేశించి పలికిన పలుకులను ఆయన గుర్తు చేశారు. మీరు కూడా ఈ ప్రసంగాన్ని  దృష్టిలో ఉంచుకుని  బీహార్ ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు. బీహారే కాదు, మధ్యప్రదేశ్, లేదా మరే ఇతర రాష్టాల ఎన్నికలకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. అన్నారు. బీహార్ ఎన్నికల్లో  విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మహా ఘట్ బంధన్… పాలక జేడీ-యూ,బీజేపీ కూటమికి గట్టి పోటీనిస్తోంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లకు పోటీ చేస్తోంది.

ఇక న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధాని జసిండా ఆర్డెన్ విజయం ప్రజాస్వామ్యంలో డీసెన్సీ (స్వఛ్చత), ప్రగతి శీలక విలువలే గెలుపునకు నాంది అవుతాయన్న ఆశాభావాన్ని కలిగించాయని చిదంబరం ట్వీట్ చేశారు.