తీగలాగితే కదులుతున్న డొంక.. హనీట్రాప్ లో షాకింగ్ నిజాలు!

ఆపరేషన్ డాల్ఫిన్ నోస్‌లో ఆశ్చర్యపోయే నిజాలు వెల్లడైన సంగతి తెలిసిందే. పలువురు నావికా దళ అధికారులను హనీట్రాప్ చేయడం ద్వారా మన దేశ సైనిక రహస్యాలను పాకిస్తాన్ నిఘా అధికారులు తెలుసుకున్న అంశంలో మరిన్ని అంశాలు వెల్లడయ్యాయి. గూఢచర్యంపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూపీ లాగుతున్నాయి. నావికాదళ సమాచారంతో పాటు హవాలా ద్వారా నగదు చేతులు మారినట్టు నిఘా వర్గాలకు కీలక ఆధారాలు లభించాయి. సోషల్ మీడియా సైట్స్‌పై ఇంటెలిజెన్స్ నిఘా పెంచేందుకు సిద్దమవుతున్నారు. పాక్ నిఘా […]

తీగలాగితే కదులుతున్న డొంక.. హనీట్రాప్ లో షాకింగ్ నిజాలు!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 17, 2020 | 7:55 AM

ఆపరేషన్ డాల్ఫిన్ నోస్‌లో ఆశ్చర్యపోయే నిజాలు వెల్లడైన సంగతి తెలిసిందే. పలువురు నావికా దళ అధికారులను హనీట్రాప్ చేయడం ద్వారా మన దేశ సైనిక రహస్యాలను పాకిస్తాన్ నిఘా అధికారులు తెలుసుకున్న అంశంలో మరిన్ని అంశాలు వెల్లడయ్యాయి. గూఢచర్యంపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూపీ లాగుతున్నాయి. నావికాదళ సమాచారంతో పాటు హవాలా ద్వారా నగదు చేతులు మారినట్టు నిఘా వర్గాలకు కీలక ఆధారాలు లభించాయి.

సోషల్ మీడియా సైట్స్‌పై ఇంటెలిజెన్స్ నిఘా పెంచేందుకు సిద్దమవుతున్నారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ హనీట్రాప్ ఉచ్చులో ఇంకా ఎవరెవరు పడ్డారన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు అరెస్టు అయిన ఏడుగురితో పాటు మరింతమంది వివరాలను నిఘావర్గాలు కూపీలాగుతున్నాయి

విశాఖపట్నం, ముంబై వంటి ప్రదేశాల్లో గుర్తు తెలియని పాకిస్తానీ ఇంటెలిజెంట్ ఆఫీసర్లు కొంతమంది వ్యక్తులతో కలిసి కుట్ర పన్నారు. వైజాగ్ లో కొందరు వ్యక్తుల ఖాతాలకు డబ్బు బదిలీ చేయబడింది. రక్షణ సంస్థలు, అంతరిక్ష పరిశోధన కేంద్రాల గురించి రహస్య సమాచారాన్ని సేకరించడం కోసం, కమ్యూనికేట్ చేయడానికి ఏజెంట్ల నియామకం కోసం వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలు ఇంటిలిజెన్స్ అధికారుల దర్యాప్తులో తేలాయి. విశాఖ నౌకాదళం గురించి లోతుగా తెలుసుకోవడానికి దుండగులు పై చర్యలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. వీరికందిన రహస్య సమాచారాన్ని వాట్సాప్ ద్వారా చేరవేస్తున్నారు.

నిందితులు భారతదేశంలోని ఆస్తులకు నష్టం, విధ్వంసం కలిగించే లక్ష్యంతో పనిచేయడానికి అంగీకరించారు. ఇవి భారతదేశ ఐక్యత, సమగ్రత, భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉంది.