ట్రంప్ మద్దతుదారులు వేధిస్తున్నారు, జో బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు తమను వేధిస్తున్నారని డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ఆరోపించారు.

  • Umakanth Rao
  • Publish Date - 10:13 am, Mon, 2 November 20

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు తమను వేధిస్తున్నారని డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ఆరోపించారు. వారు టెక్సాస్ జాతీయరహదారిలో తమ వాహనాలతో తన ప్రచార బస్సులను వెంబడిస్తూ నానా యాగీ చేశారని అన్నారు. ట్రంప్ పతాకాలు, పోస్టర్లతో కూడిన పలు ట్రక్కులు, ఇతర వాహనాలు బైడెన్-హారిస్ బస్సును చుట్టుముట్టినట్టుగా, దాదాపు ఢీ కొట్టినట్టుగా సాగిన వీడియో ట్విటర్ లో పోస్ట్ అయింది. ట్రంప్ స్వయంగా ఈ సంఘటన తాలూకు వీడియోను పోస్ట్ చేస్తూ..’ ఐ లవ్ టెక్సాస్’ అని పేర్కొన్నారు.టెక్సాస్ లోని నిరసనకారులు బైడెన్ బస్సును ‘రక్షించడానికి ప్రయత్నించారని’ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాగా ఆ బస్సులో సెనెటర్ వెండీ డేవిస్ ప్రయాణించినట్టు తెలిసింది. ఈ వాహనాన్ని ట్రంప్ సపోర్టర్లు మధ్యలో ఆపివేశారని, భద్రతా కారణాల నెపంతో రెండు ప్రచార కార్యక్రమాలను రద్దు చేశారని డెమొక్రాట్ ప్రతినిధులు  ఆరోపించారు. అటు-బైడెన్-హారిస్ బస్సు ఘటనపై ఎఫ్ బీ ఐ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది.